అజేయుడు ‘దయన్న’ … మరోమారు పాలకుర్తి బరిలో

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు అజేయు డిగా తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఆ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్‌ కా వడంతో పాలకుర్తి నుండి పోటీచేసి వరుసగా మూడు సా ర్లు విజయం సాధించి హ్యాట్రిక్‌తో రికార్డు సృష్టించారు. రెండుసార్లు హ్యాట్రిక్‌ సాధించిన ఎమ్మెల్యేగా ‘దయన్న’ అ రుదైన రికార్డు సృష్టించారు. పాలకుర్తి నియోజకవర్గంలో వరుసగా 2009, 2014, 2018లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో 1994, 199 9, 2004లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గానికి జరిగిన ఎన్నిక లో ఒకసారి టిడిప నుండి పోటీ చేసి ఎంపిగా విజయం సాధించారు. వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల నుం డి డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించి వరుసగా 6సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు మరోమారు పాలకుర్తి నియోజకవర్గం నుండి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పో టీ చేస్తున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం నుండి 199 4, 1999, 2004లో వరుసగా టిడిపి నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్‌ సాధించారు. వర్ధన్నపేట ని యోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్‌ చేయడంతో పాలకుర్తి ని యోజకవర్గం నుండి పోటీ చేశారు. 2009, 2014లలో టిడిపి అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించగా, 2018 లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించా రు. మరోమారు బిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ‘ఎర్ర బెల్లి’ టిఆర్‌ఎస్‌లో చేరి గత ఎన్నికల్లో విజయం సాధించా కనే సీఎం కేసీఆర్‌ తన కేబినెట్‌లో కీల కమైన రాష్ట్ర పం చాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి సరఫ రా పథకం మంత్రిగా చేశారు. టీడీపీలో పనిచేసిన సంద ర్భంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి ద క్కని ‘ఎర్రబెల్లి’కి సీఎం కేసీఆర్‌ మంత్రిని చేయడం పట్ల అత్యంత విధేయతను ప్రదర్శించారు.
అపారమైన అనుభవంతో..
రాజకీయాల్లో అపారమైన అనుభవాన్ని గడించిన ఎ ర్రబెల్లి దయాకర్‌రావును ప్రజలు ముద్దుగా ‘దయన్న’గా పి లుచుకుంటారు. క్లిష్ట సమయాల్లోనూ తనదైన శైలిలో ద యాకర్‌రావు విజయం సాధించడం గమనార్హం. 2009 ఎన్నికల్లో టిడిపి నుండి పాలకుర్తిలో తొలిసారి పోటీ చేసి న దయాకర్‌రావు తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్ధి డాక్టర్‌ దు గ్యాల శ్రీనివాసరావుపై 2,673 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014లో మళ్లీ టీడీపీ నుండి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి ‘దుగ్యాల’పై 4,313 ఓట్ల మెజార్టీతో గెలి చారు. ఈ రెండు ఎన్నికల్లో ‘ఎర్రబెల్లి’, ‘దుగ్యాల’ నువ్వా ? నేనా ? అన్నట్టు తలపడ్డారు.
భారీ మెజార్టీతో రెండో హ్యాట్రిక్‌
పాలకుర్తి నియోజకవర్గంలో 2018లో జరిగిన ఎన్ని కల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఎర్రబెల్లి ద యాకర్‌రావు భారీ మెజార్టీతో విజయం సాధించి రెండో హ్యాట్రిక్‌ సాధించారు. ఈ ఎన్నికల్లో ‘ఎర్రబెల్లి’ తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్థి జంగా రాఘవరెడ్డిపై 53 వేల 53 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ‘ఎర్రబెల్లి’ తన కెరీ ర్‌లో ఎమ్మెల్యేగా సాధించిన మెజార్టీల్లో ఇదే భారీ మెజార్టీ కావడం గమనార్హం.
పాలకుర్తి నుండి మరోమారు..
పాలకుర్తి నియోజకవర్గం నుండి మరోమారు బీ ఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎర్రబెల్లి దయాకర్‌రావు రంగంలోకి ది గారు. తొలినుండే తనదైన ప్రచారంతో దూసుకుపోతు న్నారు. ఒకపక్క ‘ఎర్రబెల్లి’, మరోవైపు ఆయన సతీమణి ఉ షాదయాకర్‌రావు నియోజకవర్గవ్యాప్తంగా సుడిగాలి ప్ర చారం నిర్వహిస్తున్నారు. ఈసారి ఎన్నికలను అత్యంత ప్ర తిష్టాత్మకంగా తీసుకున్న ‘ఎర్రబెల్లి’ పాలకుర్తిలోనే క్యాంప్‌ వేసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ శ్రేణుల్లో ఎలాం టి అసహనానికి చోటు ఇవ్వకుండా అప్రమత్తంగా వ్యవహ రిస్తూ ప్రచారంలో వేగాన్ని పెంచారు.
ఏదేమైనా ఈ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో విజ యం సాధించి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అత్యధికసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించడానికి తీవ్రంగా ప్ర యత్నిస్తున్నారు. అదేజరిగితే ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయాల్లో ‘ఎర్రబెల్లి’ తనదైన ముద్ర వేసినట్టేనని రాజ కీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Spread the love