ఐటీఐలో బోధనా సిబ్బంది కోసం దరఖాస్తులకు ఆహ్వానం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో గల ప్రభుత్వ ఇండిస్టీయల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌(ఐటీఐ) ఫ్యాషన్‌ డిజైన్‌ టెక్నాలజీ విభాగంలో బోధనా సిబ్బంది కోసం దరఖాస్తులు కోరుతున్నట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 18 ఏండ్ల నుంచి 34 ఏండ్ల మధ్య వయస్సు కలిగి మూడు, నాలుగేండ్ల ఫ్యాషన్‌ టెక్నాలజీ డిగ్రీ పట్టా పొందిన ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. ఎంపికైతే రూ.22,750 గౌరవ వేతనమిస్తామని తెలిపారు. ఆసక్తిగల అబ
రó్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లను జత చేస్తూ ప్రిన్సిపల్‌, ప్రభుత్వ ఐటీఐ, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, హైదరాబాద్‌, 500020 అడ్రస్‌కు ఈ నెల పదో తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 94401 37907ను సంప్రదించాలని కోరారు.

Spread the love