గ్రామీణులకు చేరువ గా తపాలా సేవలు :  ఐపీఓ రమేష్ నాయక్

నవతెలంగాణ – అశ్వారావుపేట : ఏనాటికి ఆనాడు మారుతున్న ఆధునిక పరిస్థితులకు తగ్గట్లు తపాలా శాఖ తన స్వరూపాన్ని మార్చుకుంటూ గ్రామీణ ప్రజలకు మరింత చేరువగా సేవలందిస్తోందని పాల్వంచ సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్సెపెక్టర్ రమేష్ నాయక్ అన్నారు. తపాలా శాఖ పాల్వంచ సబ్ డివిజన్ పరిధిలోని 74 బ్రాంచి తపాలా కార్యాలయాలకు ధర్మల్ ప్రింటర్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం అశ్వారావుపేట లో ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తపాలా కార్యాలయాల్లో ఎస్బీ,ఆర్డీ, సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, పీఎల్, ఆర్పీఎల్ ఐ లాంటి పథకాలను అమలు పరుస్తోందని చెప్పారు.దేశంలో గ్రామీణ తపాలా జీవితబీమా, ఆర్డీ, సుకన్య సమృద్ధి యోజన పథకాల అమలులో తపాలాశాఖ మొదటి స్థానంలో ఉందని చెప్పారు.డిజిటల్ పేమెంటు విధానంతో తపాలా కార్యాలయాలు లబ్దిదారుల ఇళ్లవద్దకే వెళ్లే అవకాశం కలిగిందన్నారు. నేడు ఇంటివద్దనుంచే తపాలా సేవలను పొందే ఏకైక సంస్థ తపాలా శాఖ కల్పించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెయి ఓవర్సీర్ శేషు, ఎసిపిఎం శ్యాం మహేంద్ర, పలువురు బీపీఎంలు పాల్గొన్నారు.
Spread the love