Monday, June 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్, అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది: ట్రంప్

ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది: ట్రంప్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమాసియాలో గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా, ఇరాన్ దేశాలు చారిత్రాత్మక శాంతి ఒప్పందానికి వచ్చాయి. దౌత్యపరమైన చర్చల అనంతరం రెండు దేశాలు తమ శత్రుత్వాన్ని వీడి, లెబనాన్ సహా అన్ని ప్రాంతాలలో సైనిక చర్యలను శాశ్వతంగా నిలిపివేయడానికి అంగీకరించాయని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఆదివారం ప్రకటించారు. ఈ చారిత్రాత్మక ఒప్పందంపై వచ్చే శుక్రవారం (జూన్ 19) స్విట్జర్లాండ్‌లో ఇరు దేశాలు అధికారికంగా సంతకాలు చేయనున్నాయి. పాకిస్థాన్, ఖతార్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు ఈ శాంతి చర్చలలో కీలక మధ్యవర్తులుగా వ్యవహరించాయి.

ఈ దౌత్యపరమైన ముందడుగును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతా ద్వారా ధ్రువీకరించారు. “ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో ఒప్పందం ఇప్పుడు పూర్తయింది. అందరికీ అభినందనలు!” అని ఆయన పోస్ట్ చేశారు. అంతేకాకుండా, హర్మూజ్ జలసంధిపై ఉన్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తక్షణమే తొలగిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్.. వాణిజ్య నౌకల రాకపోకలకు జలసంధిని తిరిగి తెరుస్తున్నట్లు స్పష్టం చేశారు. “ప్రపంచ దేశాల నౌకలు.. మీ ఇంజన్లను స్టార్ట్ చేయండి. చమురును ప్రవహించనివ్వండి!” అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెం గరీబాబాది కూడా ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ద్వారా ఈ ఒప్పందాన్ని, జూన్ 19 స్విట్జర్లాండ్ షెడ్యూల్‌ను అధికారికంగా ధ్రువీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -