నవతెలంగాణ-నవాబు పేట
మండల పరిధిలోని కాకర్లపహడ్ గ్రామానికి చెందిన రైతు సత్యం పశువుల పాకల పథకం నిధుల గోల్‌మాల్ -బట్టబయలైన అక్రమాల చిట్టా అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పూర్తి స్థాయి సమాచారం ఉందా లేదా అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఏదిఏమైనా ప్రచారం జరుగుతోంది. పశువుల పాకల పథకం అమలులో భారీ అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సత్యం తనకు జరిగిన నష్టానికి సంబంధించి సమగ్ర సమాచారం కోసం సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించి సంబంధించిన అధికారుల తీరుపై తీవ్ర విమర్శలకు దారితీసే విధంగా ఉన్నాయి.
ప్రభుత్వం నిర్దేశించిన డిజైన్ మ్యాప్‌ను పక్కనపెట్టి, నిబంధనలకు విరుద్ధంగా నివాస గృహాలకు,గుడిసెలకు టూ-సైడ్ షెడ్లకు నిధులు మంజూరు చేశారు అని ఆరోపించారు. డబుల్ ఫండింగ్ దందా: 2020-21లో ఇప్పటికే పూర్తయిన పాత సెడ్లకు, మళ్ళీ 2023-24లో కొత్తగా నిర్మాణం జరిగినట్లు పత్రాలు సృష్టించి, నిధులను అడ్డగోలుగా దారి మళ్లించారు. నెల రోజులుగా క్షేత్రస్థాయి క్వాలిటీ కంట్రోల్ నివేదికను అధికారులు ఎందుకు బయటపెట్టడం లేదు? ఇందులో అవినీతి భాగోతం బయటపడుతుందనే భయంతోనే రిపోర్టులను దాచిపెడుతున్నారనే ఆరోపణలు బలపడుతున్నాయని అన్నారు. ప్రభుత్వ నిధులను కమిషన్ల కోసం ఇలా అడ్డగోలుగా మళ్లించడంపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కిన సంబంధిత అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, నిధుల గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ జరిపించాలని సత్యం డిమాండ్ చేస్తున్నారు.



