సాగునీటిని పొదుపుగా వాడుకోవాలి

– మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెరిక శ్రీనివాస్
నవతెలంగాణ నసురుల్లాబాద్ రైతుల ము ఖాల్లో ఆనందం చూడడమే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆశయం అని మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్ అన్నారు. ఆదివారం నసురుల్లాబాద్ మండలంలోని అంకోల్ క్యాంప్ లో నాయకులతో, రైతులతో సమావేశం నిర్వహించారు. నసురుల్లాబాద్, బీర్కూర్, వర్ని, కోటగిరి మండలాల్లో ఇప్పటికే వరి నాట్లు వేస్తున్నారు.
నారుమల్లు పెరిగిన సాగునీరు లేక పోవడంతో రైతులకు జాప్యం జరుగుతుందని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి రైతులు తీసుకవేళ్ళగా వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సమస్యను వివరించి సాగునీరు విడుదలకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నేడు నిజాంసాగార్ సాగునీటిని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, విడుదల చేశారని అన్నారు. తక్కువగా ఉన్న సాగునీటి ని రైతులు పోదుపుగా వాడుకోవాలని సూచించారు. ఒక్క చుక్క కూడా నీరు వృథా పోరాదన్నారు. ఎప్పటికప్పుడు అధికా రులు కెనాల్‌ కట్టపై పర్యటించి వివరాలు తెలుసుకోవాలన్నారు. విరివెంట ఎంపీపీ పాల్త్యా విఠల్, సొసైటీ చైర్మన్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love