తెలంగాణలో ఉన్నది ఫ్రెండ్లీ ప్రభుత్వమేనా!?

Is Telangana a friendly government?రాష్ట్ర అసెంబ్లీకి 2023 నవంబర్‌ 30న ఎన్నికలు జరగ నున్నాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను, అందులోనూ 3 కోట్ల 17 లక్షల మంది ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల మేనిఫెస్టోలను సిద్ధం చేస్తున్నాయి. అధికార బీఆర్‌ ఎస్‌ పార్టీ అక్టోబర్‌ 15న ఎన్నికల మేనిఫెస్టో ప్రక టించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ, వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల మేనిఫెస్టో ల కోసం కసరత్తు చేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ తన మేని ఫెస్టో మత గ్రంధాలకంటే పవిత్రమైనదని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు గొప్పగా ప్రకటించారు. గౌరవ ముఖ్యమంత్రి సాధారణ ఓట ర్లను ఆకర్షించేందుకు అనేక వాగ్దానాలను బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ ఘనమైన మేనిఫెస్టోలో రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు సేవలందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్‌, ఔట్‌సో ర్సింగ్‌ తదితర కేటగిరీల్లోని సిబ్బంది న్యాయసమ్మతమైన సమ స్యలను మేనిఫెస్టోలో చేర్చకపోవడం యాధృచ్చికం కాదు. నూత నపెన్షన్‌ విధానం రద్దు చేయాలని తెలంగాణతో సహా దేశవ్యాప్త ఉద్యమం జరుగుతున్న ప్రస్తుత స్థితిలోనూ ఎన్‌పిఎస్‌ రద్దు కోసం ఒక కమిటీని వేస్తానని ముఖ్యమంత్రి చేతులు దులుపు కోవడం విడ్డూరం. హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌ వంటి రాష్ట్రాల్లో ఎన్‌పిఎస్‌ రద్దు చేసిన అనుభవాలు ఉన్నప్పటికీ ఎన్‌పి ఎస్‌పై కమిటీ పేరుతో వ్యూహాత్మకంగా వ్యవహరించా మనుకున్నప్పటికీ నూతన పెన్షన్‌ విధానం వర్తించే ఉద్యోగుల్లో తీవ్ర విమర్శల పాలైంది.
ఉద్యోగుల పట్ల ప్రభుత్వ అడ్డగోలు వాదనలు
ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ ఉద్యోగు లను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా జీతాలు చెల్లిస్తున్నామని, మాదీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెబుతూనే మరోవైపు పిఆర్‌సి పెంపు ప్రభుత్వానికి ఆర్థిక భారమని పదేపదే ప్రస్తావిస్తుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్లిష్టంగా ఉందని, అప్పులు చేయడానికి కేంద్రం విధించిన ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం అడ్డంకిగా ఉందని చెబు తోంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌ అని చెబుతున్న పాలకులకు ఈ కృషిలో ఉద్యోగుల పాత్ర ప్రము ఖంగా ఉందన్నది తెలంగాణ సమాజం యావత్తు గమనిస్తు న్నది. అయినా ఉద్యోగుల జీతాలు, ఇతర ఆర్ధిక ప్రయో జనాల గురించి చులకన చేస్తూ ప్రభు త్వం మాట్లాడటం అన్యాయం. ప్రజల ముందు పారద ర్శకంగా వాస్తవాలు తెలిపితే తప్పే మీలేదు. రాష్ట్ర జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య గురించి బీఆర్‌ఎస్‌ ఎందుకు మాట్లాడదు? 9 ఏళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగులపై పడుతున్న పని భారం గురించి ఎందుకు స్పందించదు. ద్రవ్యో ల్బణం, విద్య, వైద్యం, రవాణా, నిత్యావసర సరు కులు, ఇతర ఖర్చులు ఏ స్థాయిలో పెరుగుతున్నదీ అన్నింటినీ సమగ్రంగా పరిశీలించి పూర్తి నిర్ధారణ లకు రావాలి. అదే విధంగా ఏయే రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు మన తెలంగాణకు ఉన్న వ్యత్యాసం శ్వేతపత్రం విడు దల చేస్తే ప్రజలకు సమగ్రత వస్తుంది. దీన్ని విస్మరించి సంద ర్భం వచ్చినప్పుడల్లా ప్రభుత్వ ఉద్యోగులను కించపర్చడం ఫ్రెండ్లీ ప్రభుత్వమని ప్రచారం చేసుకునే బీఆర్‌ఎస్‌ పార్టీకి సబబుకాదు.
ప్రచారార్భాటం – వాస్తవ విరుద్ధం
ధనిక రాష్ట్రమని, ఆదాయానికి లోటు లేదనీ అనేక సార్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో నిజముంటే ఉద్యో గులకు ఇచ్చే వేతనాలు, ఇతర సౌకర్యాలు మెరుగ్గా ఉన్నా ప్రభు త్వానికి వచ్చే నష్టమేమీ లేదు. కానీ ద్వంద్వ ప్రమాణాలు, అవకా శవాద ప్రకటనలు చేయడం తెలంగాణ సమాజాన్ని మోసగిం చడమే అవుతుంది. ఉద్యోగులు మాకు వ్యతిరేకంగా ఉన్నారు, ఓట్లు ఎలాగూ వెయ్యరు కాబట్టి ఉద్యోగుల సమస్యలు విస్మరిం చినా నష్టం లేదన్న రీతిలో ప్రభుత్వ పెద్దలున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. వీటిని ప్రభుత్వ పరంగానూ, బీఆర్‌ఎస్‌ పార్టీగా ను ఖండించింది లేదు. దీంతో పాటు ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ప్రభుత్వ నిర్ణయాలు ఈ వాదనలను బలపర్చేవిగా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ముందు 2023 జూలైలో జరిగిన చిట్టచివరి అసెంబ్లీ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర 2వ పిఆర్‌సి కమిటీ వేస్తామని ప్రపంచం అబ్బురపోయే ఐఆర్‌ ప్రకటిస్తామని ఘనంగా ప్రకటించారు. చివరికి 2023 అక్టోబర్‌ 2న 5 శాతం ఐఆర్‌తో సరి పెట్టడం దేశంలోకెల్లా వింతే. వాస్త వంగా ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు 3 డిఎలు ఇవ్వాలి. ఇవి ఇచ్చినా సు మారు 6 శాతం అయ్యేవి. డిఏలను కూడా ఏండ్ల తరబడి పెండింగ్‌లో పెట్టడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. ఆర్‌టిసి ఉద్యోగులకు 2 పే-స్కేల్స్‌ తో పాటు 3 డిఏలు కూడా పెండిం గ్‌లో పెట్టింది. ఉద్యోగులు దాచుకున్న జి.పి.ఎఫ్‌ నుండి పిల్లల చదువులకోసం, ఆరోగ్యం కోసం, ఇల్లు కట్టుకోవడం కోసం లోను కు అప్లై చేస్తే రెండేండ్లయినా మంజూరు చేయడం లేదు. సరెం డర్‌ లీవు, సప్లిమెంటరీ బిల్లులు పాస్‌ కావడం లేదు. అందుకే ఆర్‌టిసి సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో విలీనం చేసే నిర్ణయం పట్ల కూడా తీవ్ర అసంతృ ప్తిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలం గాణ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగుల ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారమై రెండేండ్లు దాటింది. అయినా తెలం గాణ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కేటాయించలేదు. జాప్యానికి కేసులు కొంత కారణమైతే, ప్రభుత్వం జీఓ విడుదల చేయడానికి కూడా తీవ్ర మైన జాప్యం చేస్తున్నది. ఇంత ముఖ్యమైన నిర్ణయం పట్ల ప్రభు త్వం మౌనం వహించడం ఉద్యోగుల్లో అసహనం, అసం తృప్తిని పెంచింది. ఉద్యోగులకు వైద్య సేవలు గొప్పగా ఉన్నాయంటు న్నది ప్రభుత్వం. కానీ ఇప్పటికే వెల్‌నెస్‌ సెంటర్లు సమస్యలకు నిలయాలుగా ఉన్నాయి. కనీసం వైద్యానికి కూడా ఉద్యోగులు నోచుకోవడం లేదు. ప్రతిష్టాత్మక నిమ్స్‌ హాస్పిటల్‌లో హెల్త్‌ కార్డు లున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు చికిత్స కాదు కదా కనీసం టెస్ట్‌లు కూడా చేయని దుస్థితి ఉన్నది. వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ను హడావిడిగా ప్రవేశపెట్టడం కూడా ఉద్యోగులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది,
ప్రభుత్వ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు గత తొమ్మి డేండ్లుగా తీవ్రమైన పనిభారంతో సతమతమవుతున్నారు. కనీస వేతనాలు 2018 నుండి పెరగాల్సి ఉండగా 2021 జూలై నెలలో జీఓ నెం.60 ప్రకారం వేతనాలు పెంచినప్పటికీ రెండేం డ్లు గడిచినా 12 ప్రభుత్వ శాఖల్లో జీవో అమలు కాకపోవడం అన్యాయం. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఉద్యోగులకు రెన్యువల్‌ విధా నం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుండి 2017 వరకు ఏడాదికొక్కసారి మాత్రమే రెన్యువల్‌ విధానం అమలులో ఉండేది. 2018 నుండి ఆరు నెలలకొకసారి రెన్యువల్‌ పద్ధతి మార్చడం వల్ల ఈ ఉద్యోగులు తీవ్ర అభద్రత లో ఉన్నారు. థర్డ్‌ పార్టీ ఏజెన్సీలు కనీస వేతనాలు అమలు చేయకుండా శ్రమ దోపిడీ చేస్తున్నా ప్రభుత్వ శాఖల హెచ్‌ఓడిలు అదుపు చేసే పరిస్థితి లేదు.
2021 నుండి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు (హైదరాబాద్‌ మొదలుకొని జిల్లాల వరకు) ప్రతినెలా 15వ తేదీ వరకు ఎదురు చూపులు తప్పడం లేదు. 60 సంవత్సరాలు సర్వీస్‌ చేసి రిటైరైన ఉద్యోగులకివ్వాల్సిన పెన్షన్‌ కూడా ప్రతినెలా 15వ తేదీనే చెల్లించడం ప్రభుత్వానికే అవమానకరం. 33 జిల్లాలు ఏర్పడ్డాక సిబ్బందిని పెంచాల్సింది పోయి 2014 తెలంగాణ ఏర్పడ్డ నాటికి ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. దీంతో పని భారం ఉద్యోగులకు తీవ్రంగా పెరిగింది. రాష్ట్రంలో 1,90,000 ప్రభు త్వ ఖాళీలు ఉండగా గడిచిన 9 ఏండ్లలో 30 వేల లోపు ఉద్యో గాలు భర్తీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో సరిపడే సిబ్బం దిని నియమించకుండా ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్స్‌ కోసం తెచ్చిన జీవో నెం.317 ప్రకారం సుమారు 50 వేల మందికి అన్యాయం జరిగిందని ఉద్యోగులు వాపోతున్నారు.
బంగారు తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఈ విధంగా సాక్షాత్కరించగా రాష్ట్రంలో అత్యధిక వేతనాలు పొందుతున్నారని సకల సౌకర్యవంతంగా జీవిస్తున్నారని, ప్రచారం చేయడం ప్రభుత్వానికి సబబు కాదు. 2023లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయని ముందుగా తెలిసిన ప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉద్యోగుల సమస్యలను మరుగున పెట్టింది. కపట ప్రేమ నటించింది. ప్రభుత్వానికి ఓట్లపై ఉన్న శ్రద్ధ ఉద్యోగుల సమస్యల పట్ల లేకపోవడమే ఈ స్థితికి కారణం. గొప్ప గొప్ప సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా మని దేశమంతటా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వానికి తెలంగాణ 4 కోట్ల ప్రజానీకానికి ఉద్యోగులందిస్తున్న సేవల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. 2023 రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలోనైనా ఉద్యోగులు తమ రాజకీయ అనుబంధాలకతీతంగా వాస్తవిక దృష్టితో బీఆర్‌ఎస్‌ పార్టీ ఉద్యోగ వ్యతిరేక వైఖరిని సాకల్యంగా అర్ధం చేసుకోవాలి. ఉద్యోగుల సమస్యల పట్ల తెలంగాణ సమాజం సానుభూతితో అర్ధం చేసుకోవడం అవసరం.
జె. వెంకటేష్‌
9490098658

Spread the love