కేటీఆర్‌కు ఐఎస్‌బీ ఆహ్వానం

– ఆగస్ట్‌ 11న మొహాలీలో విద్యార్థులనుద్దేశించి : ప్రసంగించనున్న మంత్రి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర పురపాలక, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ) ఆహ్వానాన్ని పంపింది. ఐఎస్‌బీ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ‘అడ్వాన్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం ఇన్‌ పబ్లిక్‌ పాలస’ ఎనిమిదవ బ్యాచ్‌ను ప్రారంభించాల్సిందిగా కేటీఆర్‌ను కోరింది. ఆగస్ట్‌ 11న మొహాలీలో జరిగే కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడనున్నారు.

Spread the love