Sunday, May 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఐఎస్ రెండో కమాండర్‌ను మట్టుబెట్టాం

ఐఎస్ రెండో కమాండర్‌ను మట్టుబెట్టాం

- Advertisement -

నైజీరియాతో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించాం :అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్ : ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ నాయకుడు అబూ‘బిలాల్ అల్ మినూకీని ఆఫ్రికాలో మట్టుబెట్టామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించారు. అమెరికా, నైజీరియా దళాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అతను చనిపోయాడని తెలిపారు. ఈ విషయాన్ని నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు కూడా ధృవీకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఐఎస్‌లో మినూకీ రెండో కమాండర్ అని, అత్యంత చురుకైన ఉగ్రవాది అని ట్రంప్ అన్నారు. నైజీరియా జాతీయుడైన మినూకీ మరణంతో ఐఎస్ ఉగ్రవాద సంస్థ అంతర్జాతీయ కార్యకలాపాలు ఇప్పుడు బాగా క్షీణించాయని చెప్పారు. తనకు అలవాటైన ఆర్భాటపు శైలిలో ట్రంప్ మాట్లాడుతూ నైజీరియాలో అత్యంత పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా ఈ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు.

ఇది చాలా సంక్లిష్టమైన పని అని అన్నారు. కాగా ట్రంప్ ప్రకటనపై ఐఎస్ ఇంకా స్పందించలేదు.అల్ మినూకీని ఐఎస్ సంస్థాగత, ఆర్థిక సూత్రధారిగా భావిస్తున్నామని, అతను అమెరికాపైనా, ఇతర దేశాలలోని దాని ప్రయోజనాలపైనా దాడులకు కుట్ర పన్నుతున్నాడని అధికారులు సీఎనఎన్ వార్తా సంస్థకు తెలిపారు. ‘ఈ రోజు రాత్రి నా ఆదేశాల మేరకు ధైర్యవంతులైన అమెరికా, నైజీరియా సాయుధ దళాలు ప్రపంచంలోనే అత్యంత చురుకైన ఉగ్రవాదిని అంతం చేయడానికి ప్రణాళికాబద్ధంగా చేపట్టిన క్లిష్టమైన ఆపరేషన్‌ను పూర్తి చేశాయి’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో రాసుకొచ్చారు. ఆఫ్రికాలో అమెరికా సైన్యానికి క్షేత్ర స్థాయిలో సమాచారాన్ని అందించే వనరులు ఉన్నాయని, అవి అల్ మినూకీ ఆచూకీని గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండేవని అన్నారు.‘ఇకపై అతను ఆఫ్రికా ప్రజలను భయపెట్టలేడు. లేదా అమెరికా ప్రజలను లక్ష్యంగా చేసుకొనే ఆపరేషన్లకు ప్రణాళికలు రూపొం దించడంలో సాయపడలేడు. అతనిని హతమార్చ డంతో ఐఎస్ అంతర్జాతీయ కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయి’ అని వివరించారు.

ఎవరీ అల్‘మినూకీ ?
అబూ‘బకర్ మహమ్మద్ అల్ మినూకీ ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతానికి చెందినవాడు. ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్‌లో సీనియర్ కమాండర్‌గా పనిచేశాడు. అంతర్జాతీయ నిధులను దారి మళ్లించడంలోనూ, ఉగ్రవాద ముఠాలకు దిశానిర్దేశం చేయడంలోనూ అల్ మినూకీ నిర్వహించిన పాత్ర కారణంగా అతనిని 2023 జూన్‌లో అమెరికా విదేశాంగ శాఖ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -