Sunday, May 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా గ్యాస్ స్టేషన్లలోట్యాంక్ రీడర్ల హ్యాకింగ్

అమెరికా గ్యాస్ స్టేషన్లలోట్యాంక్ రీడర్ల హ్యాకింగ్

- Advertisement -

ఇరాన్ వైపు వేలెత్తి చూపుతున్న అధికారులు
వాషింగ్టన్ : ఇరాన్‌తో సంబంధమున్న హ్యాకర్లే కారణమని అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు. రక్షణ లేని ఆటోమేటిక్ ట్యాంక్ గేజ్ (ఏటీజీ) వ్యవస్థలను హ్యాకర్లు దుర్వినియోగం చేశారని వారు సీఎనఎన్ వార్తా సంస్థకు తెలియజేశారు. అమెరికాలోని మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒకటని వారు ఆరోపించారు. అయితే ఉల్లంఘనల కారణంగా ఎలాంటి నష్టం జరగలేదని, ఇంధన స్థాయిలలో మార్పులు చోటుచేసుకోలేదని అధికారులు చెప్పారు. కంప్యూటర్ వ్యవస్థలు ఆన్‌లైన్ ద్వారానే పనిచేసినప్పటికీ వాటికి పాస్‌వర్డ్ రక్షణ లేదు. దీంతో హ్యాకర్లు తేలికగా తమ పని చేసుకుపోయారు. యుద్ధ సమయంలో మొదలైన ఇరాన్ సైబర్ కార్యకలాపాలు వేగవంతమయ్యాయని, వాటి పరిధి కూడా పెరిగిందని ఇజ్రాయిల్ సైబర్ డిఫెన్స్ ఏజెన్సీ అయిన జాతీయ సైబర్ డైరెక్టరేట్ అధిపతి యొస్సీ కరాడీ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -