Sunday, May 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంక్యూబాపై మరో కుట్ర

క్యూబాపై మరో కుట్ర

- Advertisement -

రెండు దశాబ్దాల నాటి ఘటన సాకుతో కాస్ట్రోపై అభియోగం మోపేందుకు అమెరికా యత్నం
హవానా : రెండు దశాబ్దాల క్రితం మానవతా సాయంతో వెళుతున్న విమానాలను కూల్చివేసిన ఘటనకు సంబంధించి క్యూబా మాజీ అధ్య క్షుడు రౌల్ కాస్ట్రోపై అభియోగాలు మోపేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. దీంతో ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా ఆంక్షలు, దిగ్బంధాల కారణంగా ఇప్పటికే క్యూబా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొం టోంది. దీనికితోడు ఇంధన కొరత కూడా తోడవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. క్యూబాలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అవినీతిమయమైనదిగా, అసమర్థ మైనదిగా చిత్రీకరించేందుకు అమెరికా చాలా కాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు 94 సంవత్సరాల విప్లవ యోధుడు కాస్ట్రోపై అభియోగ పత్రాన్ని మోపాలని చూడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడు-తోంది.

అమెరికా తాజా చర్యపై క్యూబా ఇప్పటి వరకూ అధికారికంగా స్పందించలేదు. అయితే విదేశాంగ మంత్రి బ్రూనో రిడ్రిగ్జ్ శుక్రవారం ధిక్కార స్వరాన్ని వినిపించారు. ‘అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ, బలప్రయోగం చేస్తానంటూ బెదిరిస్తున్నప్పటికీ తన సామ్యవాద అభివృద్ధి దిశగా సార్వభౌమత్వ మార్గంలో కొనసాగుతుంది’ అని ఆయన న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో స్పష్టం చేశారు. అమెరికాతో జరుగుతున్న చర్చలకు తాజా పరిణామం విఘాతం కలిగిస్తుందని, రెండు దేశాల మధ్య దౌత్య సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని క్యూబన్లు ఆందోళన వ్యక్తం చేశారు.

దశాబ్దాల పాటు సైన్యాన్ని పర్యవేక్షించి, 2008‘2018 మధ్యకాలంలో దేశాధ్యక్షుడిగా పనిచేసిన కాస్ట్రోపై అభియోగాన్ని మోపడమంటే క్యూబా ఆత్మగౌరవానికి అవమానం కలిగించడమే అవుతుందని వారు అభిప్రాయపడ్డారు. కాస్ట్రోను అమెరికా అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే కర్రలు, రాళ్లతో ప్రతిఘటించి క్యూబాను రక్షించుకుంటామని చెప్పారు. ‘ఇది ఓ అల్టిమేటం. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం’ అని ఓ క్యూబన్ ఆవేశంగా అన్నాడు. కాస్ట్రోను నిర్బంధించడానికి లేదా హత్య చేయడానికి ఈ అభియోగపత్రాన్ని ఓ సాకుగా అమెరికా చూపుతోందని క్యూబన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరిలో వెనిజులా అధ్యక్షుడు మదురోను నిర్బంధించిన తర్వాత తన తదుపరి లక్ష్యం క్యూబాయేనని ట్రంప్ చెప్పిన మాటలను వారు గుర్తు చేశారు. కాస్ట్రో ఇప్పుడు పదవిలో లేరు. అయినప్పటికీ ఇప్పటికీ అయనను అత్యంత ప్రతిభావంతమైన నేతగా, క్యూబా విప్లవానికి ప్రతీకగా ప్రజలు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -