Sunday, May 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‘సర్‌‌’పై అపోహలొద్దు

‘సర్‌‌’పై అపోహలొద్దు

- Advertisement -

ఎన్‌ఆర్‌‌సీ తెలంగాణకు వర్తించదు
ఓటర్‌ ‌మ్యాపింగ్‌కు 2002 సర్‌ ‌ప్రామాణికం కాదు
గుర్తింపునకు ఆధార్‌‌తో సహా 12 కార్డులు చెల్లుబాటు :
రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌‌రెడ్డి
​నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌) ప్రక్రియపై ప్రజలు అపోహ పడొద్దని రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్‌‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌‌లోని బీఆర్‌కే భవన్‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా చూడటమే ఎస్‌ఐఆర్‌ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.​ రాష్ట్రంలో చివరిసారిగా 2002లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ జరిగిందనీ, దాదాపు 25 ఏళ్లకు మళ్లీ ఈ ప్రక్రియ మళ్లీ జరుగుతోందని తెలిపారు. సర్‌ ప్రక్రియలో బాగంగా ‘జూన్‌ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని తెలిపారు. ‘బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వో) ప్రతి ఇంటిని సందర్శించి రెండు ప్రతుల ఓటరు నమోదు ఫారంలను అందజేస్తారు. బీఎల్‌‌వో ఇంటిని సందర్శించినప్పుడు ఇల్లు తాళం వేసి ఉంటే, కనీసం మూడు సార్లు సందర్శిస్తారు. ఓటర్లు తమ నమోదు ఫారంలను ఆన్‌‌లైన్‌‌లో కూడా డౌన్లోడ్ చేసుకుని పూరించి సమర్పించవచ్చు.

ఓటర్లు తమ పేరు లేదా తమ తల్లిదండ్రులు, తాత లేదా అమ్మమ్మ పేర్లు 2002 ప్రత్యేక సమగ్ర సవరణ ఓటరు జాబితాలో ఉన్నట్లయితే వాటి వివరాలను కూడా నమోదు చేయవలసి ఉంటుంది. అయితే అది మ్యాండెటరీ కాదు. ఆధార్‌ ‌కార్డుతో పాటు 12 గుర్తింపు కార్డులు చెల్లుబాటు అవుతాయి. నిర్దిష్ట సమయంలో నమోదు ఫారం సమర్పించలేని ఓటర్లు, క్లెయిమ్ లు, అభ్యంతరాల కాలంలో నిర్దేశిత ప్రకటన ఫారంతో పాటు ఫారం-6 సమర్పించి పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు’ అని సుదర్శన్‌‌రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు సమర్పించని ఓటర్ల విషయంలో ఈఆర్‌‌వో, ఏఈఆర్‌‌వోలు విచారణ చేస్తారని అన్నారు. విచారణ సమయంలో అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. అయినా జాబితాపై అభ్యంతరాలుంటే ఎలక్ష‍న్‌ ‌రిటర్నింగ్‌ అధికారి (ఈఆర్‌‌వో) తీసుకున్న ఏ నిర్ణయంపైనైనా ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 లోని సెక్షన్ 24(a) ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్‌‌కు అప్పీల్ చేయవచ్చన్నారు. మొదటి అప్పీల్ అధికారి నిర్ణయంపై 25 24(b) ప్రకారం రిజిస్ర్టేషన్‌ ఆఫ్‌ ఎలక్ష‍న్‌ ‌రూల్స్‌ 1960లోని రూల్‌ 27 ప్రకారం ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో)కు రెండో అప్పీల్ చేయవచ్చని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో సర్‌ ‌హెల్ప్‌ ‌డెస్క్‌‌లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నేషనల్‌ ‌రిజిస్ట్రర్‌ ఆఫ్‌ ‌సిటిజన్స్‌ (ఎన్‌ఆర్‌‌సీ) తెలంగాణకు వర్తించదని స్పష్టం చేశారు.

ఆన్‌‌లైన్‌‌లో అవకాశం
సర్‌ నమోదు ఆన్‌లైన్‌లో voters.eci.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఎన్యుమరేషన్‌ చేసుకునే అవకాశం ఉందన్నారు. పూర్తి చేసిన ఎన్యుమరేషన్‌ ఫాంలు సేకరించి డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ఇస్తామని తెలిపారు. ఓటరు జాబితా ముసాయిదాను రాజకీయ పార్టీలకు ఇవ్వడంతో పాటు
వెబ్‌సైట్‌లోనూ పెడతామన్నారు. జులై 31న డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ఇస్తామని పేర్కొన్నారు. అభ్యంతరాల అనంతరం అక్టోబర్‌ 1న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని తెలిపారు.

తెలంగాణ సర్‌ షెడ్యూల్
కార్యక్రమం కాలపరిమితి
1).సన్నాహం/శిక్షణ/ముద్రణ ………15.06.2026 నుంచి 24.06.2026 వరకు
2). గృహ సర్వే కాలం……. 25.06.2026 నుంచి 
 24.07.2026 వరకు
(బీఎల్‌‌వోల ఇంటింటి సందర్శనలు)
3).పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ……. 
 24.07.2026 నుంచి 31.07.2026 వరకు
4). ముసాయిదా ఓటరు జాబితా 
 ప్రచురణ …………31.07.2026
5).అభ్యంతరాలు, క్లెయిమ్ ల దాఖలు కాలం …………31.07.2026 నుంచి 30.08.2026వరకు
6). నోటీసుల జారీ, విచారణ క్లేయిమ్‌‌లు/
 అభ్యంతరాల పరిష్కారం……… 31.07.2026 
 నుంచి 28.09.2026వరకు
7). తుది ఓటరు జాబితా ప్రచురణ………………. 
 01-10-2026
​ సర్‌ ‌మ్యాపింగ్‌ ‌అధికారులు, 
సిబ్బంది, ఇతర వివరాలు
1). మొత్తం ఓటర్లు …… 
 3,39,24,664
2). మ్యాపింగ్‌ ‌చేసినవి …… 
 2,18,39,741
3). మ్యాపింగ్‌ ‌పర్సెంటేజ్‌ ….. 
 64.38
4). జిల్లా ఎన్నికల అధికారులు ….. 
 33
5).ఎలక్ట్రోరల్‌ ‌రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్స్‌ (ఈఆర్‌‌వో) ……. 119
6)అసిస్టెంట్‌ ఎలక్ట్రోరల్‌ ‌రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్స్‌ 
 (ఏఈఆర్‌‌వో).. 867
7)బీఎల్‌‌వో సూపర్‌‌వైజర్స్ ………… 3,596
8)బూత్‌ ‌లెవల్‌ ఆఫీసర్స్‌ (బీఎల్‌‌వో) ………. 35,985

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -