ఇజ్రాయిల్ మిలటరీ ధృవీకరణ
టెల్ అవీవ్ : గాజాలో జరిపిన దాడుల్లో హమాస్ సీనియర్ మిలటరీ నేత అల్ హదద్ మరణించాడని ఇజ్రాయిల్ రక్షణ బలగాలు,అంతర్గత భద్రతా వ్యవస్థలు ప్రకటించాయి.హమాస్ సీనియర్ అధికారి కూడా స్పానిష్ వార్తా సంస్థ వద్ద ఈ విషయాన్ని ధృవీకరించారు.ఆయనను అమర వీరునిగా అభివర్ణించారు.
శనివారం గాజాలోని ఒక మసీదు వద్ద ఆయన అంత్యక్రియిలు జరిగాయి.ఈ దాడుల్లో మరణించిన ఆయన భార్య,కుమార్తెల మృత దేహాలను కూడా అక్కడే వుంచారు.రిమాల్ ప్రాంతంలో ఒక భవంతిపై శుక్రవారం జరిగిన దాడుల్లో మొత్తంగా ఏడుగురు మరణించారు. హమాస్ ఉపయోగించిన ఆయుధాల న్నింటినీ అప్పగించడానికి తిరస్కరిస్తున్న ఏకైక వ్యక్తి అల్ హదద్ అని అందువల్లే ఆయనను ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకుందని హమాస్ వర్గాలు వెల్లడించాయి.క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న నేతలతో సహా రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుం టున్నప్పటికీ ఒప్పంద నిబందనలు,షరతులకు హమాస్ కట్టుబడి వుందని,ఇజ్రాయిల్ కూడా వాటిని గౌరవించాలని మధ్యవర్తులు చెప్పాలని హమాస్ పేర్కొంది.గతేడాది అక్టోబరులో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుండి గాజాలో మరణించిన వారి సంఖ్య 850కి చేరుకుంది.
గాజా దాడుల్లో హమాస్ సీనియర్ మిలటరీ నేత హతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



