Sunday, May 17, 2026
E-PAPER
Homeవరంగల్కాంగ్రెస్ ప్రభుత్వంలో చీకటి పాలన.!

కాంగ్రెస్ ప్రభుత్వంలో చీకటి పాలన.!

- Advertisement -

ఓటు విలువ తెలువకనే అణగారిని వర్గాలుగా మిగిలిపోతున్నం
జన్మదిన వేడుకల్లో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌
నవతెలంగాణ – మల్హర్ రావు:

కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో మంథని నియోజకవర్గంలో చీకటి పాలన మొదలైందని,ఆ చీకటి పాలనను అంతం చేస్తేనే మళ్లీ వెలుగులు వస్తాయని, 2028లో నియోజకవర్గానికి వెలుగులు తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు.మండలం రుద్రారం గ్రామంలో మంథని ప్రజాస్వామ్య పోరాటం కార్యక్రమంలో చీకటి పాలనకు చరమగీతం పలికిన రోజే తన జన్మదిన జరుపుకుంటున్న సందర్భంగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.అంతక ముందు మంథని పట్టణంలోని రాజగృహాలో తమ అభిమానులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి పుట్ట మధూకర్‌ శైలజ దంపతులు కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించగా అంబేద్కర్‌ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన వేడుకల్లో వారు పాల్గొని కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.రుద్రారం గ్రామంలో నిర్వహించిన రక్తదాన శిభిరంలో పాల్గొన్నారు. అనంతరం జన్మదిన వేడుకల్లో ఏర్పాటు చేసిన సభలో భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి, మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు.

తనకు తల్లి తల్లిదండ్రులు ఉన్నారని, జన్మదినం కూడా ఉందని, కానీ జన్మదినం చేసుకునే స్థోమత లేకనో అది తెలువకనో ఎప్పుడు చేసుకోలేదన్నారు.తాను తల్లిదండ్రులను చూడకపోయినా అక్కాచెల్లెలు,అన్నలు తనను ఆశీర్వదించి సేవ చేసే అవకాశం ఇచ్చిన రోజునే తన జన్మదినం జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.అయితే ఈనాడు ప్రజాస్వామ్యం,ఓటు ప్రాముఖ్యత, గొప్పతనం సమాజానికి తెలియజేయాలనే అడుగు ముందుకు వేశానని తెలిపారు.తల్లిని చూడలేదు తండ్రి ఆలనాపాలన తెలియదని,సమాజంలోనే పెరిగి ఈ సమాజమే నా కుటుంబం అని బావించి ముందుకు నడిస్తే మంథనిలో ఎవరికి దక్కని అనేక అవకాశాలు కల్పించారన్నారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ఇచ్చి గొప్పవాళ్లుగా ఎదుగాలని సంకల్పించిన అంబేద్కర్‌ అర్థం కాకపోవడం చదువుకుంటెనే సమాజంలో గౌరవం అంటే తెలుస్తదని తన బార్యను ఒప్పించి పిల్లలు కనకుండా దేశంలోని పిల్లలను తమ పిల్లలుగా బావించి మన కోసం త్యాగం చేసిన మహాత్యా జ్యోతిరావు పూలే తెలియకపోవడం బాధాకరమన్నారు.మనం ఎందుకు ఓటు వేస్తున్నమో ఎందుకు ఉపయోగించుకుంటున్నమో అర్థం కాకనే బీసీలు ఎస్సీలు ఎస్సీలే ఆకలితో అలమటించడానికి, అణగారిన వర్గానికి కారణం మన ఓటును మనం సక్రమంగా వినియోగించుకోకపోవడమేనని ఆయన అన్నారు.రుద్రారం ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని ప్రస్తుత ఎమ్మెల్యేను ప్రేమిస్తున్నరే కానీ అటు నుంచి ప్రేమలేదని గ్రహించాలన్నారు.

తాను 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 268 ఓట్లు మైనస్‌ ఇచ్చారని, మళ్లీ 2014లో 30ఓట్లు ఎక్కువ వేశారన్నారు. కేవలం 30ఓట్ల మెజార్టీ ఇస్తే రుద్రారంలో పది కోట్ల అభివృద్ది చేశామని ఆయన గుర్తు చేశారు. సబ్‌స్టేషన్‌లు, రోడ్లు అనేకం చేశామన్నారు. కానీ మళ్లీ 2018లో 398మైనస్‌ చేసిండ్లని అయినా మీ పై ప్రేమ తగ్గలేదని,రుద్రారం వాసుల చిరకాల కోరికైన పాత రుద్రారం శంకరంపల్లి రోడ్డును పూర్తి చేశామన్నారు. కాంగ్రెస్‌ నాయకులకు బానిసత్వంతప్ప ప్రజాస్వామ్యం తెలువదని గమనించాలని, వాళ్ల జీవితాలు అంతేనన్నారు.రుద్రారం గ్రామప్రజలు ఎమ్మెల్యేకు గొప్ప అవకాశం ఇచ్చిండ్లని, 513ఓట్ల మెజార్టీ ఇస్తే ఇక్కడ తట్టెడు మట్టి పోయలేదన్నారు.మంథని ఎమ్మెల్యే చేతిలో గొప్ప అవకాశం ఉన్నా మన భవిష్యత్‌ను మార్చే అధికారం ఉన్నా గ్రామ రూపురేకలు మార్చే అవకాశం ఉన్నా ఇటు కన్నెత్తి చూడటం లేదన్నారు.మనం ఓట్లు వేసి గెలిపిస్తే వాళ్లు అభివృద్ది చెందుతున్నారని, తన తమ్ముడికి పెద్ద పదవి ఇచ్చిండని, వెనుక ముందు పోలీస్‌ వాహనాలతో వెళ్తుండన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇల్లు, పెన్షన్‌ ఇచ్చినమని చెప్తున్నరని అన్నారు. పిల్లలకు ఉద్యోగం ఇప్పిస్తే చాలు ఇల్లు పెన్షన్‌ వద్దని చెప్పేలా చైతన్యం ఎప్పుడు వస్తుందో అప్పుడు స్వాతంత్య్రం వచ్చినట్లన్నారు.రుద్రారం గ్రామంలో బీటెక్‌ చదువుకున్న వాళ్లు 28, డిగ్రీ 105 బీఈడీ 3 పీజీ ఎంసీఏ 09 ఐటీఐ 03 ఉన్నారని, ఒక్కరికైనా ఉద్యోగం కల్పించిందాని చర్చించాలన్నారు. ఎప్పటి వరకు చర్చ జరుగదో అప్పటి వరకు మనల్ని ఓటు వేసే యంత్రాలుగానే చూస్తారని అన్నారు. ఒక్క ఉద్యోగం వస్తే ఆ కుటుంబం గొప్పగా బతుకతదని, ఆ ఊరు బాగుపడుతుందన్నారు.రుద్రారం,రొంపికుంట,అడవిశ్రీరాంపూర్‌ గ్రామాల్లో సైతం ఇలాంటి పరిస్థతులే ఉన్నాయని,ఎమ్మెల్యే సొంత ఊరు ధన్వాడలో సైతం ఒక్కరికి ఉద్యోగం పెట్టించలేని దుస్థితి వాళ్లదని ఎద్దేవా చేశారు.రొంపికుంటలో ఐటీఐ బీటెక్‌ చేసిన వాళ్లు 66 మంది డిగ్రీ చదివిన వాళ్లు 179 ఎంబీఏ పీజీ చేసిన వాళ్లు 06 ఇంటర్‌ చదివిన వాళ్లు 35 ఐటీఐ చేసిన వాళ్లు 12 మంది ఉన్నారని, ఇక్కడ కూడా ఒక్కరికి ఉద్యోగం పెట్టియ్యలేదన్నారు. అలాగే అడవిశ్రీరాంపూర్‌లో బీటెక్‌ 18 డిగ్రీ 43 ఇంటర్‌ 20 పీజీ 09మంది ఉన్నరని, ఒక్కరికి ఉద్యోగం లేదని, ఉద్యోగాలు పెట్టిస్తే డబ్బులు సంపాదిస్తే ఓటు విలువ తెలుస్తదని వాళ్లకు అర్థమై మనకు ఉద్యోగాలు కల్పించడం లేదన్నారు.ఎప్పుడు ఓట్లు వస్తే అప్పుడు కాటారం మండల ప్రజలు వేలలో మెజార్టీ ఇస్తున్నా వాళ్లు ఇక్కడి ప్రజల గురించి ఆలోచన చేయడం లేదని గమనించాలన్నారు.ఆనాడు తమకు అవకాశం ఇస్తే సమాజం బాగు కోసం అనేక కార్యక్రమాలు చేశామని,మహదేవ్‌పూర్‌ ఆస్పత్రిని బాగు చేసి డెలివరీలు జరిగేలా చర్యలు తీసుకున్నామని, పేద ప్రజల వైద్య అవసరాల కోసం అంబులెన్స్‌లు పెట్టించామని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ, మంథని ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఏమీ చేయకున్నా ప్రజల గురించి ఆలోచన చేయకున్నా వన్‌సైడ్‌ ఓట్లు వేస్తున్నారని ఆయన వాపోయారు.

ఓటు మాత్రమే మన తలరాత మారుస్తదని,నాయకుడిగా ఎమ్మెల్యే మాత్రమే మన జీవితాలను బాగుపరుస్తడని గ్రహించాలన్నారు. రుద్రారంలో ఇంకా అనేక రోడ్లు కావాల్సి ఉందని, రెండేళ్లు అయినా మంథని ఎమ్మెల్యే పట్టించుకుంటలేడని, చిన్నకాళేశ్వరం గురించి మాట్లాడిన ఎమ్మెల్యే ఈనాడు దాని ఊసే ఎత్తుత లేడన్నారు.నియోజకవర్గ ప్రజలను మోసం చేసి ఐదు సార్లు ఎలా గెలిచిండో కాంగ్రెస్‌ పార్టీ గమనించి రాష్ట్రప్రజలనుకూడా మోసం చేయాలని చిత్రగుప్తుడిగా మానీఫెస్టో కమిటి చైర్మన్‌గా మంథని ఎమ్మెల్యేకు అవకాశం ఇస్తే 420హమీలు, ఆరు గ్యారెంటీలు రాసిండని, కానీ ఇప్పటి వరకు ఒక్కటి అమలు చేయకపోయినా ఒకటి రెండు మాత్రమే మిగిలిపోయాయని గొప్పలు చెప్పుకుంటాండ్లని ఆయన విమర్శించారు.వెయ్యి కోట్లు తీసుకువచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారే కానీ వంద కోట్ల పనులు కాలేదన్నారు.మంత్రి పదవిలో ఉండి దేవరాంపల్లి,గంగారం, శంకరాంపల్లి వద్ద రోడ్డు పని పూర్తి కాలేదన్నారు.రుద్రారం ప్రజలు ఇన్నిసార్లు ఓట్లు వేస్తే మీ భవిష్యత్‌ కోసం ఆలోచన చేయలేదని కానీ మాతోటైనా మీ భవిష్యత్‌ మారతుందని ఆశపడుతున్నామెసన్నారు. అధికారంలో ఉంటే అన్నం పెట్టి చదువులు చెప్పించామని, అధికారంలో లేకపోతే హైదరాబాద్‌కు మకాం మార్చకుండా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని అన్నారు. ప్రజల కోసం ప్రభుత్వ మెడలు వంచడానికి పోరాటం చేస్తే మా మీద కేసులు పెడుతున్నరని అన్నారు. అయినా ఎక్కడకు వెళ్లినా దీవెనలు దొరుకుతున్నాయని, మళ్తీ కేసీఆర్‌ రావాలని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాండ్లని చెప్పారు. కాటారం మండలం…రుద్రారం నుంచే మార్పు మొదలు కావాలని యువత కోరుకున్నట్లుగానే జరుగాలన్నారు. ఈనాడు కాంగ్రెస్‌ బీజేపీ పార్టీలు ములాఖత్‌ అయి పనిచేస్తన్నయని, బడేబాయి చోటేబాయ్‌ తరహాలో ఉన్నారని, మోడీ సీఎంను తనతో కలిసి కలిపి పని చేయమంటున్నరంటే ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్‌కు ధీటైన పార్టీ బీఆర్‌ఎస్‌ పార్టీనే అని, ప్రజల కోసం పని చేసే పార్టీ బీఆర్‌ఎస్‌ పార్టీ అని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు, రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో చీకటి పాలనకు చరమగీత పాడి వెలుగులు నిండే రోజులు వస్తాయని ఆనాడు ప్రజా జన్మదిన వేడుకలను జరుపుకుందామని ఆయన పిలుపునిచ్చారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -