8మంది మృతి – 25మందికి గాయాలు
బ్యాంకాక్: థాయిలాండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.రాజధాని బ్యాంకాక్‌లో బస్సును సరుకు రవాణా చేస్తున్న రైలు ఢీ కొనడంతో 8మంది మరణించారు.మరో25మంది గాయపడ్డారు.బ్యాంకాక్‌లో ఎయిర్‌పోర్ట్ రైల్ లింక్ స్టేషన్‌కు సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.వెంటనే బస్సును మంటలు చుట్టుముట్టాయని థాయి మీడియా తెలిపింది.కాగా కచ్చితంగా మృతుల సంఖ్యను అధికారికంగా ధృవీకరిం చలేదు.,అలాగే ప్రమాదానికి గల కారణం కూడా తెలియరాలేదు.స్థానిక కాలమానం ప్రకారం 3.40గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.భద్రతా బారియర్లను దాటుకుని మరీ రైలు పట్టాలపై బస్సు చిక్కుకుపోయి వుండడం కనిపిస్తోంది.ఆగివున్న బస్సును వేగంగా వచ్చిన రైలు ఢీ కొనడమే కాకుండా తనతో పాటు కొంత దూరం లాక్కుని వెళ్ళిపోయింది,దాంతో పాటే మరికొన్ని వాహనాలను కూడా ఈడ్చుకుని వెళ్ళిపోయింది,ఆ వెంటనే బస్సు మంటల్లో చిక్కుకుంది.ఆ వాహనాల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు లాగి రక్షించేందుకు అగ్నిమాపక యంత్రాలు,సహాయక సిబ్బంది యత్నించారు.వెంటనే మంటలను కూడా అదుపులోకి తెచ్చారు.గాయపడిన దాదాపు 25మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.
బ్యాంకాక్‌లో బస్సును ఢీ కొన్న రైలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



