వైద్య సిబ్బందికి నియామక పత్రాలు అందజేత

నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు వైద్య సిబ్బందిని రెగ్యుల రైజ్‌ చేసిన సందర్బంగా శుక్రవారం 31 మంది ఆరోగ్య కార్యకర్తలు (ఎంపీహెచ్‌ఏ (ఎం)) కు హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జె.వెంకటి చేతులమీదుగా నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 ఏండ్లుగా కాంట్రాక్టు సర్వీసెస్‌ పైన, కొవిడ్‌ సమయంలో ప్రాణాలకు తెగించి పని చేసినందుకు, ప్రతి ఏడాదీ కీటక జనిత వ్యాధులు మలేరియా, డెంగ్యూ వ్యాధి తీవ్రతను తగ్గించే విధంగా కృషి చేసినందుకు కృత జ్ఞతలు తెలిపారు. ఇప్పడి నుంచి మీరు బాగా కస్టపడి పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో పాల్గొని సేవాదృక్పథంతో పని చేయాలని కోరారు. రెగ్యు లర్‌ అయిన సిబ్బంది మాట్లాడుతూ సీఎం తమ కుటుం బాల్లో ఆనందం, వెలుగుని నింపారని తెలిపారు. ఈ కార్య క్రమంలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ జి.వెంకటేశ్వర్లు, డిస్ట్రిక్‌ మలేరియా ఇన్‌చార్జి అధికారి నిరంజన్‌, ఆఫీస్‌ సిబ్బంది, 31 మంది రెగ్యులర్‌ అయిన సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love