నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఆర్‌ఏలో కారుణ్య నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ సోమవారం విడుదల చేసింది. 61ఏండ్లకుపైబడిన వీఆర్‌ఏలు తమ కుటుంబ సభ్యుల నుంచి ఎన్‌ఓసతో పాటు అఫిడవిట్‌ను తప్పనిసరిగా ఇవ్వా లని రెవెన్యూశాఖ నిర్ణయించింది. అయితే వీఆర్‌ఏలను వెంటనే తహసీల్దార్లు రిలీవ్ చేయాలని సూచించింది. కేటాయించిన జిల్లాకు సంబంధించిన కలెక్టర్ పోస్టింగ్ ఇవ్వనున్నారు. 61ఏండ్ల వరకు ఉన్న వీఆర్‌ఏలకు సంబంధించిన వివరాలను ఆయా జిల్లా కలెక్టర్లు వెరిఫై చేయనున్న ట్టు రెవెన్యూ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిట్టల్ తెలిపారు.