సొంత ఇంటి కల నెరవేరుస్తున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమే

– లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీ అందజేస్తున్నఎంపీపీ
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్  :
మండలంలో శనివారం రోజున ఇంటింటికివెళ్ లిగృహలక్ష్మి ధ్రువపత్రాలను లబ్ధిదారులకు ఎంపీపీ ప్రతాప్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయంగా అందజేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రూ.60 నుంచి రూ.70 వేలు మాత్రమే ఇచ్చే వారని, దాంట్లో ఏఈలకు, పైౖరవికారులకు పోను మిగతావి వచ్చేది కూడా కష్టంగా ఉండేదని ఆరోపించారు. బేసిమెంట్‌కు రూ.లక్ష, స్లాబ్‌కు రూ.లక్ష, ప్లాస్టరింగ్‌కు రూ.లక్ష చొప్పున రూ.3 లక్షలు నేరుగా లబ్ధిదారులైన మహిళల ఖాతాల్లో తమ ప్రభుత్వం వేస్తుందని వివరించారు. గృహలక్ష్మి కోసం నాయకులకు, అధికారులకు నయాపైసా లంచం ఇవ్వద్దని, ఎవరైనా అడిగితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో  సర్పంచ్ తిరుమల్ రెడ్డి, సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, ఉపసర్పంచ్ కొండ విట్టల్, బీఆర్ఎస్ కార్యకర్తలు బౌసింగ్, మమ్మద్,లబ్ధిదారులువిట్టల్ గౌడ్, అయ్యర్ దత్తు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love