మునుగోడులో కదం తొక్కిన కమ్యూనిస్టులు..

– జహంగీర్ కు ఘన స్వాగతం పలికిన జిల్లా, మండల కమిటీ సభ్యులు ..
– డప్పు, కోలాట కళాకారులతో  మారుమగిన మునుగోడు.. 
– అంబేద్కర్ కు పూలమాలవేసి కార్మికుల కష్టాలు తెలుసుకున్న  జహంగీర్..
నవతెలంగాణ – మునుగోడు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎర్ర జెండాకు ఒక చరిత్ర ఉంది భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం సాగిన పోరులో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరులను స్మరించుకుంటూ మళ్లీ ఎర్ర జెండాకు వన్నెతెచ్చే విధంగా సీపీఐ(ఎం) పార్టీ ప్రతి ఎన్నికల సమరంలో  పోటీ పడుతున్న సీపీఐ(ఎం) అభ్యర్థులకు ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందడంతో రాబోయే రోజుల్లో ఎర్ర జెండా రాజ్యం రావడం ఖాయం అనే విధంగా ఉంది.  సోమవారం మునుగోడు మండలంలో సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ ప్రచారం కు రావడంతో జిల్లా,  మండల కమిటీ ఆధ్వర్యంలో జహంగీర్ కు ఘన స్వాగతం పలికారు. మునుగోడు మండల కేంద్రంలోని వీధి వీధినా డప్పు కోలాటం బృందాలతో ఇంటింటి ప్రచారం నిర్వహించి స్థానిక స్థానిక చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు ప్రచార రథం చూసి ప్రజా సమస్యల పైన పోరాడే ఎర్రజెండా నాయకుడి కోసం ఎదురొచ్చి స్వాగతం పలికి ఈ ఎన్నికల సమరంలో గెలిచేది మీరే అంటూ గ్రామపంచాయతీ కార్మికులు దీవించారు. అనంతరం మునుగోడు పెద్ద చెరువులో ఉపాధి కార్మికుల వద్దకు వెళ్లి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధి హామీ పథకం అమలు కోసం ఎర్రజెండా చేసిన పోరాటాలను ఉపాధి కార్మికులకు వివరించారు. ఉపాధి కార్మికులంతా ఎర్రజెండాకే ఓటు వేస్తామని కార్మికులంతా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి , జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు గడ్డం వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు వెంకట రమణారెడ్డి, పద్మ, కొండ వెంకన్న, మునుగోడు మండల కార్యదర్శి మీర్యల భరత్, సహాయ కార్యదర్శి వరుకుప్పల ముత్యాలు, మండల కమిటీ సభ్యులు యాస రాణి శ్రీను, వేముల లింగస్వామి, సాగర్ల మల్లేష్, యాట యాదయ్య, కట్ట లింగస్వామి, యాస రాణి వీరయ్య తదితరులు ఉన్నారు.
Spread the love