‘జబర్దస్త్‌ కమెడియన్‌ పంచ్‌ ప్రసాద్‌కు చేయూత’

రూ. లక్ష సాయం చేసిన కోవిద సహదయ ఫౌండేషన్‌
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
జబర్దస్త్‌ కమెడియన్‌ పంచ్‌ ప్రసాద్‌కు ‘కోవిద సహదయ’ ఫౌండేషన్‌ అండగా నిలిచింది. ఫౌండేషన్‌ వ్యవస్థాప కురాలు డాక్టర్‌ జి.అనూహ్యరెడ్డి రూ.1లక్ష సాయాన్ని పంచ్‌ ప్రసాద్‌, అతని భార్యకు అందజేసినట్లు మంగళ వారం ఆమె తెలిపారు. కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పంచ్‌ ప్రసాద్‌కు ఆర్థిక ఇబ్బందులు సైతం చుట్టు ముట్టాయి. వైద్యానికి సహాయ, సహాకారాలు లేకపోవడంతో సాయం కోసం అభ్యర్థించారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం పంచ్‌ ప్రసాద్‌కు అండగా నిలుస్తూ వైద్య ఖర్చులను సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా అందజేసినట్లు, అయితే అతని కుటుంబ పోషణ, మందుల ఖర్చులు తదితర వాటికి తాను ఉన్నానంటూ అనూహ్యరెడ్డి ముందుకొచ్చారు. యాంకర్‌ రోషన్‌తో కలసి అనూహ్యరెడ్డి పంచ్‌ ప్రసాద్‌కు తన స్వగృహంలో చెక్కును అందజేశారు.

Spread the love