జగదీష్ రెడ్డి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది

– పార్టీ ఫిరాయింపులకు తెరలేపింది మీరే కదా కేసీఆర్, జగదీష్ రెడ్డి.?
– అసెంబ్లీ సీఎల్పీ మీడియా హాల్ సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జగదీష్ రెడ్డి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని, పార్టీ ఫిరాయింపులకు తెరలేపింది మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కాద అని ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ సీఎల్పీ మీడియా హాల్ సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తో కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్ ను ప్రజలు చీదరించుకోవడంతో పార్టీ ఉనికి కోల్పోయిందనారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఒక్క సీటు గెలవలేదని, డిపాజిట్ కూడా రాలేదని అన్నారు. కేసీఆర్ దగ్గర చెంచా గిరి చేసి పిరాయింపు లు చేసింది మీరే నని విమర్శించారు. విద్యుత్ రంగంలో 80వేల కోట్ల అప్పులు చేసిండ్రని, విద్యుత్ అవకతవలపై కమిషన్ ముందు కేసీఆర్ హాజరుకాలేదని, అసెంబ్లీకి హాజరు కావడం లేదని బిఆర్ఎస్ కు తెలంగాణలో స్థానం లేదనారు. చేరికలు ప్రోత్సహించిందే కేసీఆర్ రే నని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వచ్ఛ మైన పాలన అందిస్తున్నారని అన్నారు.
అనంతరం నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం మాట్లాడారు. 2014 ముందు జగదీష్ రెడ్డి ఆస్తి ఎంత,ఇప్పుడు ఎంత అని, బహిరంగ చర్చకు సిద్ధమా జగదీష్ రెడ్డి అని సవాల్ విసిరారు. రెండు రోజుల నుండి కేసీఆర్, జగదీష్ రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నారని, తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని, మేమే తెలంగాణ తెచ్చామని అంటుంన్నారు అని , పదేండ్లలో బీఆర్ఎస్ హయాంలో లో అనేక స్కామ్ లు జరిగాయనారు. మాజీ విద్యుత్ శాఖా మంత్రి ఎలాంటి అక్రమాలు జరగలేదు జ్యూడిషియల్ విచారణ చేయమన్నాడు. కేసీఆర్ డైరెక్షన్ తో జగదీష్ రెడ్డి అసెంబ్లీ లో మాట్లాతారని అన్నారు. ఇప్పుడు విచారణ చేపట్టొద్దని కేసీఆర్, జగదీష్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ చెప్పకుండానే జగదీష్ జ్యూడిషియల్ విచారణ చెయ్యమన్నారని, ఇప్పుడు జ్యూడిషియల్ విచారణ కు హాజరు కాము అంటున్నారు. విద్యుత్ రంగాన్ని అంధకారంలో నెట్టే ప్రయత్నం చేశారని అర్థం అవుతుందని, పొరాడే తత్వం ఉన్న కేసీఆర్ ఎందుకు డొంక దారి వెతుక్కుంటున్నాడో, వెయ్యి మెగా వాట్ల విద్యుత్ ను కొనుగోలు చేసి వెయ్యి మెగావాట్ల ఎక్సస్ తెచ్చిండ్రని, ఇసుక దందాకే యాదాద్రి ప్లాంట్ తెచ్చిండ్రు తప్పా, నల్లగొండ జిల్లాలో జగదీష్ రెడ్డి కి అవినీతి అక్రమాల మీద ఉన్న శ్రద్ద అభివృద్ధి మీద లేదనారు. విద్యుత్తు అక్రమాల మీద ఉన్న వాటా జగదీష్ రెడ్డి కి,కేసీఆర్ కి ఎంత? మీరు నిజాయితీ పరులైతే కమిషన్ ముందు హాజరు కావాలని కోరారు.

Spread the love