
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయవేత్త, దళితజనోద్దారకుడు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అనునిత్యం పోరాడిన భారత దేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రాం బాటలో ప్రతి ఒక్కరు నడవాలని అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సుంకరి విజయ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ మాజీ ఉప ప్రధానిగా స్వర్గీయ బాబు జగ్జీవన్ రాం అందించిన సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా నాయకులు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల గౌరవ అధ్యక్షులు పాలెపు నర్సయ్య, నాయకులు పాలెపు కిరణ్, లెక్చరర్ సాయన్న, బాబు రావు, కొంటికంటి నరేందర్, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.