నవ తెలంగాణ- జక్రాన్ పల్లి :
జక్రాన్ పల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కుంచాల విమల రాజు ఆధ్వర్యంలో జరిగింది. వ్యవసాయ శాఖ కార్యక్రమాలపై,ఉద్యానవన శాఖ కార్యక్రమాలపై, రెవెన్యూ మరియు పౌరసరఫరాలపై, సాగునీటి పారుదల శాఖ అంశములపై, వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాలపై, గ్రామ పంచాయతీలు మరియు గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలపై, విద్యాశాఖ కార్యక్రమాలపై, గ్రామీణ త్రాగునీటి శాఖ కార్యక్రమంపై, నర్తన పవర్ డిస్ట్రిబ్యూషన్ శాఖ కార్యక్రమాలపై, పశు పోషణ శాఖ కార్యక్రమాలపై,మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పై, అంగన్వాడీ కేంద్రంలో పై, ఇందిరా క్రాంతి పథకం పై, సాంఘిక సంక్షేమ శాఖ, మహిళా సంక్షేమ శాఖ, వీటిపై ఈ అంశాలపై సర్వసభ్య సమావేశం సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బ్రహ్మానందం, వైస్ ఎంపీపీ మూసుకు తిరుపతి రెడ్డి, ఎంపీఓ యుసఫ్ ఖాన్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, మండల కో ఆప్షన్ సభ్యుడు బుల్లెట్ అక్బర్ ఖాన్, స్థానిక వైద్య అధికారి డాక్టర్ రవీందర్, ఆరోగ్య విస్తీర్ణఅధికారి డాక్టర్ అఖిల్, మండల పశువైద్య అధికారి శిరీష, ఆయుర్వేదిక్ అధికారి లలిత,ఎపిఓ రవి, ఆర్ ఐ ప్రవీణ్, ఏపియం రవీందర్, సంతోష్, రాజు, సుజాత తదితరులు పాల్గొన్నారు.