Thursday, August 20, 2026
E-PAPER
Homeబీజినెస్Amazon.in & ఫ్లిప్ కార్ట్ లలో డిజిటల్ రీచ్ ను విస్తరించిన జావా యెజ్డీ మోటార్ సైకిల్స్

Amazon.in & ఫ్లిప్ కార్ట్ లలో డిజిటల్ రీచ్ ను విస్తరించిన జావా యెజ్డీ మోటార్ సైకిల్స్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : Amazon.in  మరియు ఫ్లిప్ కార్ట్ లలో  జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ యెజ్డీ రోడ్ స్టర్ రెడ్ వొల్ఫ్ ను ప్రారంభించాయి. భారతదేశంలో ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ ఫాంల ద్వారా భారీ సంఖ్యలో ప్రజల వద్దకు తమ ఇటీవలి రోడ్ స్టర్ ను తీసుకువెళ్తున్నాయి. ఈ చర్య బ్రాండ్ యొక్క డిజిటల్-ఫస్ట్ విధానాన్ని శక్తివంతం చేస్తోంది మరియు తమ పెరుగుతున్న అథీకృత డీలర్ షిప్ నెట్ వర్క్  మద్దతు ద్వారా  ఆన్ లైన్ లో తమ యాజమాన్య ప్రయాణాన్ని నిరంతరంగా కనుగొని మరియు ప్రారంభించడానికి కస్టమర్లకు వీలు కల్పిస్తోంది.

యెజ్డీ వారి 1970ల వారసత్వంతో ప్రేరణ చెందిన రెడ్ వొల్ఫ్ తమ లోతైన రెడ్ ఫినిష్, విస్తృతమైన క్రోమ్ వివరాలు మరియు సాహసోపేతమైన రోడ్ స్టర్ భంగిమతో ప్రత్యేకంగా నిలిచింది. 350 ఆల్ఫా 2 లిక్విడ్-కూల్డ్ ఇంజన్ తో మద్దతు చేయబడిన 6 స్పీడ్ గేర్ బాక్స్ మరియు అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్ లతో ఈ మోటార్ సైకిల్ ఉత్తమమైన మరియు ఆకర్షణీయమైన రైడింగ్ అనుభవం ఇస్తుంది. దూర ప్రయాణాల సౌకర్యం కోసం రూపొందించబడిన దీనిలో సౌకర్యవంతమైన అనుకూలమైన, డ్యూయల్-ఛానల్ ABS ఫీచర్లతో   దీని 12.5 L  ఇంధనం ట్యాంక్ 350 కిమీ రేంజ్ ను ఇస్తుంది.

అనుపమ్ థరేజా, సహ-స్థాపకులు, జావా యెజ్డీ మోటార్ సైకిల్స్, ఇలా అన్నారు, “యెజ్డీ రోడ్ స్టర్ యొక్క  విలక్షణమైన స్టైలింగ్ మరియు ఉత్తమమైన ఇంజనీరింగ్ కారణంగా రైడర్స్ ను ఎంతో ఆకర్షించింది. రెడ్ వొల్ఫ్ వచ్చినప్పుడు, అది ఇది వరకు ఎన్నడూ లేని విధంగా  తన సమూహాన్ని ఆకర్షించింది. భారతదేశంలో ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ ఫాంలపై దీని లభ్యతతో, రెడ్ వొల్ఫ్  తమ సాహసవంతమైన వ్యక్తిత్వాన్ని వివిధ భారతదేశపు నగరాలకు తీసుకువెళ్లగలదు. రైడర్స్ తమ బైక్స్ ను కనుగొని, వాటి యాజమాన్య ప్రయాణాన్ని సజావుగా ప్రారంభించడానికి ఆన్ లైన్ ఉనికి మాకు అత్యంత అవసరమైనది మరియు మా శ్రేణిలోని పెర్ఫార్మెన్స్ క్లాసిక్ లను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి మేము నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాము.”

డిజిటల్ గా కనుగొనడం మరియు సౌకర్యవంతమైన కొనుగోలు కోసం పెరుగుతున్న వినియోగదారు ప్రాధాన్యతతో, ఈ కార్యక్రమం బ్రాండ్ తన రీచ్ ను సంప్రదాయబద్ధమైన షోరూంలను మించి చేరుకోవడానికి మరియు దేశవ్యాప్తంగా ఉన్న విస్తృతమైన రైడర్స్ తో కనక్ట్ అవడానికి సహాయపడుతుంది. ఇది భారతదేశంలో ప్రీమియం మోటార్ సైకిల్ కోసం ఇ-కామర్స్ ను అత్యధికంగా వినియోగించడంలో కంపెనీ వారికి ఆరంభంలో ఉన్న నాయకత్వాన్ని కూడా శక్తివంతం చేస్తుంది.

ద యెజ్డీ రోడ్ స్టర్ రెడ్ వొల్ఫ్ రూ. 2,09,950కి (ఎక్స్-షోరూం ఢిల్లీ)లభిస్తోంది మరియు అథీకృత డీలర్ షిప్స్ లో లభిస్తోంది మరియు ఫ్లిప్ కార్ట్ మరియు  Amazon.in లు ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు.

ఆన్ లైన్ కొనుగోలు ఏ విధంగా పని చేస్తుంది:

  1. Amazon.in  లేదా ఫ్లిప్ కార్ట్ లో ఎక్స్-షోరూం బుక్కింగ్ మొత్తం చెల్లించండి.
  2. అథీకృత స్థానిక డీలర్ ఆర్డర్ ను నిర్థారిస్తారు మరియు మిగిలిన ఆన్-రోడ్డు చెల్లింపు కోసం కస్టమర్ కు సలహా ఇస్తారు.
  3. డీలర్ షిప్ లో రిజిస్ట్రేషన్ మరియు బీమాలు పూర్తవుతాయి. తదుపరి  వాహనం అంతిమంగా అప్పగించబడుతుంది.
  4. యాక్ససరీస్ మరియు ఆడ్-ఆన్స్ డీలర్ షిప్ కొనుగోళ్ల వద్ద నిలిచి ఉంటాయి.

యాజమాన్య హామీ కార్యక్రమం:

జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ పరిశ్రమలో -మొదటి యాజమాన్య హామీ కార్యక్రమంతో కొనసాగుతుంది, కస్టమర్ల సంతృప్తి మరియు ఇబ్బందిలేని యాజమాన్యానికి ప్రాధాన్యతనిస్తుంది. దీనిలో ఈ కిందవి భాగంగా ఉన్నాయి :

·       4-సంవత్సరాలు /50,000-కిమీ స్టాండర్డ్ వారంటీ  *

·       6 సంవత్సరాల వరకు దీర్ఘకాల వారంటీ ఎంపికలు*

·       8  సంవత్సరాల వరకు రోడ్ సైడ్ సహాయం  *

·       దేశవ్యాప్తంగా కవరేజ్ తో  5  సంవత్సరాల వరకు AMC *

·       దేశవ్యాప్తంగా 450+సేల్స్ మరియు సర్వీస్ టచ్ పాయింట్స్ లో సమగ్రమైన యాజమాన్య ప్రయోజనాలు లభ్యం   

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -