Thursday, August 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మల్లారెడ్డిపల్లిలో ఉచిత వైద్య శిబిరం

మల్లారెడ్డిపల్లిలో ఉచిత వైద్య శిబిరం

- Advertisement -

సర్పంచ్ తోట రాములు
నవతెలంగాణ-నవాబు పేట
గ్రామ ప్రజలు ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో తమ గ్రామానికి డాక్టర్ లను పిలిపించి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అని మల్లారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ తోట రాములు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం సీజన్ లో ప్రజలు అనారోగ్యానికి గురి కాకూడదని ముందు జాగ్రత్త చర్యగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రి సిబ్బంది ముప్పై మంది డాక్టర్లు పలు రకాల వైద్య సేవలను అందించారు. ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం సంబంధించిన ఆసుపత్రిలోనే వైద్యం అందిస్తామని డాక్టర్ లు తెలిపారు.స ర్పంచ్ సేవలు అభినందనీయం గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -