జాతీయస్థాయి గణిత ఒలంపియాడ్‌లో జయ విద్యార్థుల హవా

నవతెలంగాణ-కోదాడరూరల్‌
పట్టణంలోని జయ పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయిలో నిర్వహించిన ఏఎమ్‌ టి గణిత ఒలంపియాడ్‌లో మొదటి లెవెల్లో ఉత్తమ ప్రతిభను కనపరిచి రెండవ లెవెల్‌కు అర్హత సాధించి ప్రతిభ కనబరిచారని ఆ పాఠశాల కరస్పాండెంట్‌ జయ వేణుగోపాల్‌ శనివారం తెలియజేశారు. జాతీయస్థాయిలో నిర్వహించిన గణిత ఒలంపియాడ్‌లో 15 మంది విద్యార్థులు రెండవ లెవెల్‌ కు అర్హత సాధించారు. ప్రైమరీ లెవెల్‌ నుండి 02, సబ్‌ జునియర్‌ లెవెల్‌ నుండి-09, జూనియర్‌ లెవెల్‌ నుండి-04 మంది అర్హత సాధించారు.5వ తరగతి నుండి ఎస్‌ కె జాహిద్‌,6వ తరగతి నుండి పి నేత్రారెడ్డి,7వ తరగతి నుండి కె శ్రీచరణ్‌, ఎస్‌ కె ఇమియాజ్‌, కె అభిజ్ఞ, యం తూర్పిక, వి కీర్తన.8వ తరగతి నుండి ఇ నిపున్‌ రెడ్డి, ఎస్‌ కె హీరాతన్వీర్‌, జి లలిత్‌ ఆదిత్య, ఎ హసిత, 9వ తరగతి నుండి సిహెచ్‌ అక్షరు, జి రాకేష్‌, ఎ వేదా 10వ తరగతి నుండి జి లోకేష్‌ లు ఉన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ జయవేణుగోపాల్‌ డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ, ప్రదానోపాద్యాయులు చిలువేరు వేణు ర్యాంకర్లను అభినందిస్తూ, జయ ఐటి ఒలంపియాడ్‌ ప్రోగ్రామ్‌ ద్వారానే ఈ ర్యాంకులు సాధించగలిగామని తెలిపారు. ఈ విద్యార్థులు రెండవ లెవల్లో కూడా ఉ త్తమ ప్రతిభను కనపరుచుటకు తమ ఉపాధ్యాయ బందం ఎంతగానో కషి చేస్తుందని, తమకు సహాయసహకారాలు అందిస్తున్న తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు పాఠశాల కరస్పాండెంట్‌ కతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ,ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Spread the love