Sunday, August 9, 2026
E-PAPER
Homeదర్వాజజస్టిస్ చంద్ర కుమార్ కి జయశంకర్‌ స్ఫూర్తి పురస్కారం

జస్టిస్ చంద్ర కుమార్ కి జయశంకర్‌ స్ఫూర్తి పురస్కారం

- Advertisement -

జస్టిస్ చంద్ర కుమార్ కి తెలంగాణ రచయితల వేదిక జయశంకర్ స్ఫూర్తి పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నెల 14 సాయంత్రం 6 గం.కు కరీంనగర్ లోని ఫిలిమ్ భవన్ లో ఈ పురస్కారాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమంలో డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొంటారు. బూర్ల వెంకటేశ్వర్లు, తెరవే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కథల పోటీ
బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్- మల్లెతీగ సాహిత్య సేవాసంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న 10వ జాతీయస్థాయి కథల పోటీకి కథకుల నుండి కథలను ఆహ్వానిస్తున్నాం. కుటుంబ వ్యవస్థలో వున్న సౌందర్యాన్ని, సౌకర్యాన్ని, నైతిక విలువల్ని తెలియజేసే కథలకు ప్రాధాన్యం. కథల్ని ‘బండికల్లు జమదగ్ని, ఫ్లాట్ నెం.402, హిమజ టవర్స్, 3/10, బ్రాడీపేట, గుంటూరు-522002 చిరునామాకు లేదా [email protected] కు ఆగస్టు 28వ తేదీలోగా పంపాలి. వివరాలకు 9848264742.

-బండికల్లు జమదగ్ని, కలిమిశ్రీ జాతీయస్థాయి కథ/ కవితా సంపుటాల పోటీ
ఆదిత్య స్కూల్స్, పిఠాపురం నిర్వహిస్తున్న రాజా వేంకట కుమార మహీపతి రావు సూర్యారావు బహుదూర్ 141వ జయంతి ఉత్సవాల సందర్భంగా జాతీయస్థాయి కథ/ కవితా సంపుటాల పోటీ నిర్వహిస్తున్నది. ఏ ప్రాంతం వారైనా పోటీ నిమిత్తం జనవరి 2025 – ఆగష్టు 2026 మధ్య ప్రచురింపబడిన సంపుటాలు రెండు కాపీలు సెప్టెంబర్‌ 5 ‌లోపు పంపాలి. చిరునామా : ఆదిత్య స్కూల్, సీతయ్యగారి తోట, పిఠాపురం -533450. ఇతర వివరాలకు : 9494553425. డా॥ నల్లమిల్లి శేషారెడ్డి, ఛైర్మన్, ఆదిత్య విద్యాసంస్థలు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -