మండలంలోని మద్దికుంట కాంగ్రెస్ అధ్యక్షులు కోమటి శాల రాజు, బీజేపీ గ్రామ ఉపాధ్యక్షులు కర్రెమ్ రాజు, తోపాటు మద్దికుంట, రెడ్డిపేట్ గ్రామాలకు చెందిన 250 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంపీపీ దశరథ్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు బొమ్మిడి రాంరెడ్డి ఆధ్వర్యంలో, ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను, గత తొమ్మిది సంవత్సరాల నుండి చేస్తున్న అభివృద్ధిని చూసి, కెసిఆర్ పోటీ చేస్తున్నందు కామారెడ్డి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేందర్, గ్రామ పార్టీ అధ్యక్షులు శంకర్, ఎంపీటీసీ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.