బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిక నుండి కాంగ్రెస్ లో చేరిక

నవతెలంగాణ- కమ్మర్ పల్లి 
మండలంలోని  కోనాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిక నాయకులు మంగళవారం కాంగ్రెస్ నాయకులు ముత్యాల సునీల్ కుమార్  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ముత్యాల సునీల్ కుమార్  నాయకత్వాన్ని బలపరిచి కాంగ్రెస్ పార్టి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని పార్టీలో చేరిన వారు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని వారు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టినీ, ముత్యాల సునీల్ కుమార్ ను గెలిపించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు.ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ.. పథకాల పేరుతో మోచేతుకు బెల్లం పెట్టి ప్రజలను వంచనకు గురి చేసినా, బయపెట్టినా ఇప్పుడు చైతన్యవంతం అయ్యారని ఇక బీఆర్ఎస్ దోపిడీ పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టిలో చేరి స్వేచ్ఛ కోసం పోరాడాలని ఆయన పిలుపనిచ్చారు. ఈ  కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love