
మండలంలోని అబ్బాపూర్(ఎం), మట్టయి ఫారం తండా సర్పంచులు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి చేతుల మీదుగా కండువా కప్పుకొని శనివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామ ప్రజల సంక్షేమం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు అబ్బాపూర్ (ఎం) సర్పంచ్ శ్రీనివాస్, మట్టయి ఫారం సర్పంచ్ రాము తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి కొంతమంది బిఆర్ఎస్ సర్పంచులు పార్టీ మాననున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.