ఎగిరే జెండాకేం తెలుసు
ఎన్నేళ్లయినా ఎగురుతూనే ఉంటుంది.
ఎగరేసినప్పుడల్లా…
తన తప్పు లేక, తప్పక.
జరుగుతోన్న విపరీతాల్ని కని
ఏమీ చేయలేక ఖిన్నురాలవుతూ!
ఓ భారతీయుల్లారా!
బానిసత్వపు చెరలను చీల్చి
మెరిసి మురిసిన కేతనమది.
ఓ భరతమాత ముద్దుబిడ్డల్లారా!
చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 ల్లాంటి
విజయాలెన్నో చవిచూసిన మీరు
జాతీయ పతాకాన్ని హృదిలో నిలుపుకొని
అవినీతి అక్రమాల మూలాల్ని ఛేదించండి,
నవయుగ సమైక్య భారతావనిని స్థాపించండి.
మీ పురిటిగడ్డ ప్రపంచానికే
మకుటాయమానమౌతుంది.
అప్పుడే ఎగురుతుంది
మువ్వన్నెల జెండా మరింత సంతోషంగా,
ఆరోజే అసలైన జెండా పండగ.
– వేమూరి శ్రీనివాస్, 9912128967