మీకు మీరే పోటీ

మీకు మీరే పోటీజీవితంలో ప్రతి అడుగు ముందుకు వేయాలనే జిజ్ఞాస, తపన ప్రతి ఒక్కరిలో వుంటుంది. చేపట్టిన ప్రతి రంగంలోనూ, అగ్రశ్రేణిలో నిలబడాలనే ఆకాంక్ష, వేడిగా, వాడిగా వుండే దశ యువతది. కాలేజి ఎన్నికల్లో నిలబడి గెలవాలని, క్రికెట్‌ టోర్నమెంట్‌ కప్పు గెలుచుకోవాలని, ఐఎఎస్‌ అవ్వాలని, కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌గా మారాలని, వలచిన ప్రియురాలి/ ప్రియుని ప్రేమను గెలుచుకోవాలని… ఇలా యువత కోరికలు అనేకం. ఆకాంక్షలు అపరిమితం. అయితే యువత ఎదురుగా కన్పించే ఒక పెద్ద అడ్డు గోడ ‘కాంపిటీషన్‌’. మీ అందరికీ తెలియని ఒక స్టన్నింగ్‌ నిజంచెప్పనా…? అది ‘మీకు మీరే పోటీ’.
ఈ నిజాన్ని మనసా, వాచా, కర్మణా గ్రహించండి. మైండ్‌ పవర్‌ను మేలుకొలపడానికి ఇదే తొలిమెట్టు. మీకు బయటనుంచి ఎటువంటి కాంపిటీషన్‌ లేదు. మీరు స్వయంగా నిర్మించుకున్న అవధుల కారణంగానే మీరనుకుంటున్న ‘పోటీ’ తయారైంది.
అద్దంలో చూసుకుంటే గానీ ఎవరి ముఖం వారికి కనబడదు. మీ కళ్లతో మీ ఫ్రెండ్స్‌ని, లోకాన్ని చూస్తారే తప్ప, మిమ్మల్ని మీరు చూసుకోరు. మిగిలిన వాళ్ళంతా చేసే పనుల్ని చూస్తారే తప్ప, మీరు చేస్తున్న పనేమిటో, పొందుతున్న శిక్షణ ఏమిటో గమనించరు.
శిక్షణ అనేది అంతర్గత క్రీడ (గేమ్‌) అని, తమ ఉన్నత భావాలు, క్రమశిక్షణ, భవిష్యదర్శనం మొదలైన అంశాలు తమ పెర్ఫార్మెన్స్‌ను నిర్ధారిస్తాయని విజేతలకు మాత్రమే తెలుసు. మైండ్‌ పవర్‌ ఏంటో తెలుసుకుంటే మనం ఎక్కడవున్నా, ఎలా వున్నా సక్సెస్‌ సాధ్యమవుతుంది. భిన్న రకాల సవాళ్ళను ఎదుర్కొనటమే విజేతలకు సోపానాలు. ”జష్ట్రaఅషవ టaఙశీబతీర ్‌ష్ట్రవ జూతీవజూaతీవస ఎఱఅస” అన్నాడు లూయిస్‌ పాశ్చర్‌.
సవాళ్లను ఎదుర్కోడానికి సిద్ధంగా వున్న వారిని మాత్రమే ‘ఛాన్స్‌’ వరిస్తుంది. విజయం, అదష్టం లక్ష్మీదేవి స్వరూపాలు కావు. యోగ్యత కల్గిన ఏ కొద్దిమంది ఇంటి తలుపులను మాత్రమే ఇవి తట్టవు. వాటిని అందుకోటానికి సిద్ధంగా వున్నవారినే అవి వరిస్తాయి. ఇక్కడ సిద్ధంగా వుండటం అనే పదాన్ని బాగా అర్ధం చేసుకోండి. ఏం మేం సిద్ధంగాలేమా ఔవ aతీవ నబఱవ్‌ తీవaసy ్‌శీ షఱఅ అని అనకండి. సిద్ధంగా వుండటం అంటే…. శిక్షణ పొంది వుండటం.
డా||హిప్నో కమలాకర్‌ ఎప్పుడూ అంటూ ఉండేవారు.. ”మైండ్‌ ఒక డైనమో లాంటిది. అది అత్యంత శక్తిమంతమైన సాధనం. ఈ సాధనాన్ని ఉపయోగించి ఉన్నత శిఖరాలనూ అధిరోహించొచ్చు. అధ:పాతాళానికీ దిగజారొచ్చు.
మీలో రగిలే ఆకాంక్షలను గురించి ఒక్కసారి ఆలోచించండి. మీలో అసంతప్తి ప్రబలిపోవటానికి మీ ఆకాంక్షలు నెరవేరకపోవటమే అని ఏనాడూ అన్పించలేదా…? ”నేను ఫలానా విధంగా వుంటేనా?” అని అన్పించలేదా?
1. నాకే గనుక అదష్టం వుంటేనా?
2. నాకే గనుక ఆత్మవిశ్వాసం దండిగా వుంటేనా?
3. నాకే గనుక మంచి మార్కులు వస్తేనా?
4. నాకే గనుక క్రికెట్‌ ఆడటం వస్తేనా?
5. నాకే గనుక పేరు ప్రఖ్యాతులు వుంటేనా?
6. నాకే గనుక మా అమ్మ నాన్న లతో మంచి సంబంధాలు వుంటేనా?
7. నాకే గనుక దురలవాట్లు వదిలించుకునే శక్తి వుంటేనా?
8. నాకే గనుక అందరినీ ఇట్టే పసిగట్టే గుణం వుంటేనా?
ప్రతివారూ ప్రస్తుతం వున్న, వుంటున్న స్థితి గతుల కంటే మెరుగైన జీవితాన్ని పొందాలని కాంక్షిస్తారు. గడియారం స్ప్రింగులా పొటెన్షియాలిటీనంతటినీ అంటి పెట్టుకుని వుండే యువత గుండెల్లో ఈ ఆకాంక్ష ఎంత దఢంగా వుంటుందో గమనించండి.
తోటి వారందరిలోకి మీరే టాపర్‌గా నిలబడటం ఎంత గాఢమైన ఆలోచనో గమనించండి. ఒక కంప్యూటర్‌ కన్నా ఎన్నో రెట్లు శక్తి మీలో దాగి వుందన్న సంగతి ఊహించుకోండి. మీ శరీరం ఎలా పరవశంతో కదిలిపోతుందో. ఆత్మ విశ్వాసం మీ గుండెల నిండా బలంగా నాటుకుపోయినట్లుగా ఊహించుకోండి. అది ఎంత అచంచలంగా స్థిరపడ్తుందో గమనించండి. గతంలో అనేకసార్లు పరీక్షలు రాశారు. చాలాసార్లు ఫెయిల్‌ అయ్యారు. కొన్నిసార్లు అతిసులభంగా పరీక్ష పాసయ్యారు. మరికొన్నిసార్లు అనేక సవాళ్ళ మధ్య అవుట్‌ స్టాండింగ్‌ మార్కులు సాధించారు.
మీరు గుర్తుంచుకోవల్సింది మీ అపజయాలను కాదు. సులువుగా సాధించేసిన విజయాలనూ కాదు. సవాళ్ళను ఎదుర్కొంటూ విజయాన్ని సాధించిన సంఘటనలను గుర్తుచేసుకోండి. ఆ అనుభవాలే మీకు పనికొస్తాయి. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.
డా|| హిప్నో పద్మా కమలాకర్‌
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

Spread the love