కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాలకు న్యాయం

– భూపాలపల్లి జిల్లా ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్ 
– తాడిచెర్లలో జోరుగా ప్రచారం
నవతెలంగాణ- మల్హర్ రావు: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడితేనే పేదలతోపాటు అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, చేతి గుర్తుకు ఓటు వేసి తెలంగాణ కాంగ్రెస్ మేనిపేస్టో చైర్మన్, మంథని కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబును భారీ మెజార్టీతో గెలిపించాలని భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ ఎస్సిసేల్ అధ్యక్షుడు దండు రమేష్ కోరారు. ఆదివారం కాపురంపల్లె, తాడిచెర్ల గ్రామాల్లో సోనియాగాంధీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలని వివరిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు కానీ హామీలు ఇవ్వడమే కాక మాయమాటలు చెప్పుతొందన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిసిన వందరోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తోందన్నారు.ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేశారపు చెంద్రయ్య,రావుల రవిందర్, ఇందారపు ప్రభాకర్, రాజా సమ్మయ్య, ప్రశాంత్ పాల్గొన్నారు.
Spread the love