ప్రకాష్‌ నగర్‌ వాసులకు న్యాయం జరిగేలా కృషి

– కాంగ్రెస్‌ కూకట్‌పల్లి ఇన్‌చార్జి బండి రమేష్‌
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
ప్రకాష్‌ నగర్‌ వాసులకు న్యాయం జరిగే విధంగా శాయ శక్తుల తన వంతు కృషి చేస్తానని కూకట్‌పల్లి నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్‌ అన్నారు. బుధవారం మియాపూర్‌లోని కూకట్‌ పల్లి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బండి రమేష్‌ ను బేగంపేట డివిజన్‌ ప్రకాష్‌ నగర్‌ వాసులు కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు మాట్లాడుతూ 194/ 8/1 ఈ సర్వే నెంబర్‌కు ఆనుకొని 184,185, 186, ప్రయివేట్‌ భూమి ఉందని, ప్రయివేట్‌ భూమి పేరుతో తమ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో తమ ఇండ్లను ఖాళీ చేయాలని రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతూ తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కాలనీ వాసులు బండి రమేష్‌కు తెలిపారు. ఈ భూమి నవాబులకు చెందినదని, అక్కడనే కొన్ని ఏండ్లుగా ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నామని తెలిపారు. భూమికి సంబంధించిన పత్రాలను బండి రమేష్‌కి ఇచ్చారు. దీంతో బండి రమేష్‌ స్పందించి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌ బాబు దష్టికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో చర్చిస్తానాని వారికి హామీ ఇచ్చారు. బండి రమేష్‌ను కలిసిన వారిలో బేగంపేట్‌ రమేష్‌, కొప్పి దినేష్‌ కుమార్‌ ,నారాయణ ఉపేందర్‌, నరసింహతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.

Spread the love