కడప కడపకూ కాంగ్రెస్‌

– అధికారంలోకి రాగానే రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌
– నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన
– వద్ధాప్య పింఛన్లు రూ.3000లు
– జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి తిరుపతిరెడ్డి
నవతెలంగాణ-నిజాంపేట
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలపరిధిలో రజాక్‌ పల్లి, ఖాసింపూర్‌, ఖాసింపూర్‌ తాండ, గ్రామాలలో గడపగడపకు కాంగ్రెస్‌ పల్లె పల్లెకు కాంగ్రెస్‌ అనే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గడపగడపకు కాంగ్రెస్‌ పల్లె పల్లెకు కాంగ్రెస్‌ అనే కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఖాసింపూర్‌ గ్రామంలో గ్రామస్తులు మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి తమ సమస్యలను పరిష్కరించడం లేదని ఖాసింపూర్‌ గ్రామ తండావాసులు తమతో చెప్తున్నారన్నారు. నాలుగు సార్లు ప్రజా ప్రతినిధిగా ఓటు వేసి గెలిపించుకున్నందుకు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఖాసింపూర్‌ తండా నుంచి తిప్పనగుల్ల గ్రామం వరకు రోడ్డు వేస్తానని చెప్పి వేయలేదని. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గ్రామానికి మొఖం చూపించలేదని గ్రామస్తులు ఆరోపించారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రూ.2000 ఉన్న పెన్షన్‌ రూ.3000కు అందిస్తామని. మహిళా సోదరీమణులకు రూ.500లకే వంటగ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తామన్నారు. నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టుకునే వారికి రూ.5 లక్షలు అందజేస్తామన్నారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటానని మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మండల అభివద్ధికి ఎల్లవేళలా కషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఖాసింపూర్‌ గ్రామంలో గ్రామానికి చెందిన 50 మంది యువకులు కాంగ్రెస్‌ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పంజా మహేందర్‌, బిసి సెల్‌ అధ్యక్షులు పల్లె రామచంద్ర గౌడ్‌, మండల అధ్యక్షులు లింగం గౌడ్‌, పట్టణ అధ్యక్షులు నసిరుద్దీన్‌, సేవాదళ్‌ అధ్యక్షులు ముత్యాల మధుసూదన్‌ రెడ్డి, సిద్ధ రాములు, మాజీ సొసైటీ చైర్మన్‌ మధుసూదన్‌ రెడ్డి, మాజీ ఎంపిటిసి చింతల స్వామి, ధరావత్‌ విటల్‌, కాకి రాజయ్య, సులేమాన్‌, బాగుల్‌ గౌడ్‌, నారా గౌడ్‌, భూమా గౌడ్‌, వెంకట్‌, నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love