లోక సభ ఎన్నికలలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం నల్గొండ జిల్లాకు వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ 2012 బ్యాచ్ కి చెందిన కళ్యాణ్ కుమార్ దాస్ ను నియమించింది. ఈ మేరకు గురువారం అయన నల్గొండ జిల్లా కేంద్రానికి రాగా, ఆర్ అండ్ బి అతిథి గృహంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్ పూలబోకేతో స్వాగతం పలికారు. వీరు లోకసభ ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లా వ్యయపరిశీలకులుగా వ్యవహరిస్తారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఆఫీసు ఎదురుగా ఉన్న ఆర్ అండ్ బి అతిథి గృహంలో అధికారిక సెల్ ఫోన్ నెంబర్ 8121446758 లో అందుబాటులో ఉంటారని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నిక్షల అధికారి దాసరి హరి చందన తెలిపారు.