- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : జుక్కల్ నియోజకవర్గంలో మద్నూర్ ఉమ్మడి మండలంలోని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల మంజూరు కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు కృషి ఫలితంగా పెళ్లిళ్లు జరిపిన నిరుపేద కుటుంబాలకు త్వరితగతిన మంజూరు అవుతున్నాయని సంతోష్ పటేల్ తెలిపారు. శుక్రవారం మద్నూర్ మండల పరిషత్ కార్యాలయంలో మద్నూర్ డోంగ్లి మండలాలకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే చేతుల మీదుగా జరగగా ఈ చెక్కుల పంపిణీ ఈ కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొన్నారు. మద్నూర్ మండలంలో 87 చెక్కులు మంజూరు కాగా డోంగ్లి మండలంలో 42 చెక్కులు మంజూరయ్యాయి.
- Advertisement -



