సంక్రాంతి సంబరాల్లో కమలా సుధీర్‌ రెడ్డి

నవతెలంగాణ – ఎల్బీనగర్‌
సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని గడ్డిఅన్నారం డివిజన్‌ పరిధిలోని రెడ్డి బ్రదర్స్‌ గల్లీలో శనివారం ముగ్గుల పోటీ, కైట్‌ ఫెస్టివల్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జయ చంద్రారెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ దేవిరెడ్డి కమలా సుధీర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కష్టపడి పండించిన పంట ఇళ్లకి చేరే సమయం ఇది అన్నారు. ధాన్యలక్ష్మికి స్వాగతం చెప్పేందుకు ఇంటి ముందు అందమైన రంగవల్లులు దర్శనమిస్తాయని చెప్పారు. ఈ సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలు, ముచ్చట గొలుపు గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలు తదితర వాటితో మొదలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ భవాని ప్రవీణ్‌ కుమార్‌, సీనియర్‌ నాయకులు బిచేనేపల్లి వెంకటేశ్వరరావు, రమేష్‌ ముదిరాజ్‌, డివిజన్‌ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్‌, రమణారెడ్డి, గండి సన్నీ, ప్రకాష్‌ రెడ్డి, శైలజ, యదా శంకర్‌, విక్కీ, శశిధర్‌, విజయ లక్ష్మీ, ఆదిలక్ష్మి, ప్రమీల, ఉష, పరమేశ్వరి, సుధీర్‌, ప్రదీప్‌, వర్షిత్‌, కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love