కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు..

– కాంగ్రెస్ తోనే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సముచిత గౌరవం- కొంగర రవి
నవతెలంగాణ-దుబ్బాక 
కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్ల  రేషన్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ నేడు అమలు జరుగుతుందని.. బీసీ ఎస్సీ ఎస్టీల కు సముచిత గౌరవం కాంగ్రెస్ సర్కార్ తోనే సాధ్యమని ఆ పార్టీ మండలాధ్యక్షులు కొంగర రవి అన్నారు.బీసీ రిజర్వేషన్ల పెంపు,ఎస్సీ వర్గీకరణ బిల్లు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు బుధవారం దుబ్బాకలోని బస్టాండ్ ఎదుట రాహుల్ గాంధీ,సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీ కి బీసీ,ఎస్సీ,ఎస్టీ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు.బాణాసంచా కాల్చి  మాట్లాడారు.బీసీలకు 42 శాతం ,వర్గీకరణ పేరిట ఎస్సీలకు 20 శాతం విద్య,ఉద్యోగ,రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించిన ఘనత కాంగ్రెస్ సర్కార్ కే దక్కుతుందన్నారు.బీసీ,ఎస్సీ వర్గీకరణ బిల్లుల్ని పార్లమెంట్ లో  బీజేపీ ఆమోదింప చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్,ఆకుల భరత్,చెక్కపల్లి పద్మయ్య,చంద్రం పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love