నవతెలంగాణ – చండూరు
మున్సిపల్ కేంద్రంలోనూ ,మండల వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలతో దేవాలయాలు భక్తులతో కిటకిట లాడారు. మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉసిరి చెట్టుకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు దీపాలు వెలిగించి దీపోత్సవం చేశారు. తెల్లవారుజామునే పుణ్య స్థానాల ఆచరించి సందర్శకులు ఆలయాల్లో బారులు తీరారు. శివనామస్మరణంతో దేవాలయాలు మార్మోగాయి. సాయంత్రం కూడ దేవాలయాల్లో దీపాలు వెలిగించి దీపోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.