అమరుల ఆశయ సాధనకు కషి చేయాలి

– సీపీఐ సీనియర్‌ నాయకులు ఉజ్జీని రత్నాకర్‌రావు
– గంట పెద్ద రాములు స్తూపం ఆవిష్కరణ
నవతెలంగాణ-చండూరు
అమరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కషి చేయాలని సీపీఐ సీనియర్‌ నాయకులు ఉజ్జిని రత్నాకర్‌రావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని కస్తాల గ్రామంలో అమరుడు గంట పెద్ద రాములు స్మారకార్థం నిర్మించిన స్థూపన్ని రాష్ట్ర పార్టీ సీనియర్‌ నాయకులు ఉజ్జిని రత్నాకర్‌రావు, జిల్లా పార్టీ కార్యదర్శి నెల్లికంటి సత్యం అవిష్కరించారు. అనంతరం రాములు ప్రథమ వర్థంతిలో వారు పాల్గొని మాట్లాడారు. గంట పెద్ద రాములు పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య, మండల పార్టీ కార్యదర్శి నలపరాజు సతీష్‌కుమార్‌, మండల పార్టీ సహాయ కార్యదర్శి పల్లె యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love