
– ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిర్మించిన ఆలయం
నవతెలంగాణ – బెజ్జంకి
కాశీ లింగేశ్వర స్వామి ఆలయం మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలో నిర్మించిన ప్రత్యేక శివాలయం. ఈ ఆలయంలో యజ్ఞ, హోమ ప్రత్యేక పూజలతో శివలింగం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలకు సిద్దమైంది. నవంబర్ 21,2012న ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన గావించారు. సకల హంగులతో నిర్మాణం పూర్తిచేసుకున్న ఆలయం భక్తులు పూజలు చేసుకోవడానికి అందుబాటులోకి రానుంది. ఈ నెల 27 నుండి 29 వరకు కాశీ లింగేశ్వర స్థిర ప్రతిష్ట మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్తర తెలంగాణకే తలమానికంగా ఆలయం ప్రసిద్ధిగా నిలుస్తోందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.
ఆలయ ప్రత్యేకతలు: ఏక స్థూప శివలింగంపై 108 లింగాలను చెక్కబడ్డాయి. ఒక్క సారి శివలింగానికి పూజ చేస్తే 108 శివలంగాలకు ఒకేసారి పూజ చేసే యోగ్యత లభించడం ఇక్కడి ప్రత్యేకత. సుమారు 42 పీట్ల ఎత్తుతో రాగితో రూపొందించిన ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించనున్నారు. లక్ష్మీపూర్ గ్రామంలో సుమారు మూడు రోజుల పాటు కాశీ లింగేశ్వర స్థిర ప్రతిష్టాపన మహోత్సవాలకు ఆలయం సిద్దమైంది. మహోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఉచిత అన్నదాన సదుపాయం ఆలయ కమిటీ సభ్యులు కల్పించారు.