కట్టె కాలే వరకు పేదోల్లను దోచుకునేది కేసీఆరే: బండి సంజయ్

– ప్రజాహిత యాత్ర కొనసాగింపు
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
కట్టే కాలేవరకు ప్రజలను దోచుకునేది కేసిఆరే నని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర గురువారం తంగళ్ళపల్లి మండల కేంద్రం నుండి మొదలు పెట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటమిపాలు కావడంతో ఇష్టం వచ్చినట్లు కేసిఆర్ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటివరకు 75 రోజులు గడిచిన ఆరు గ్యారెంటీ లపై ఎలాంటి స్పష్టత ఇంకా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కోసం కట్టె కాలే వరకు కొట్లాడుతానని చెప్పిన కేసీఆర్ అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం తన కొడుకు పేరు మార్చుకున్న ఘనత కేసిఆర్ కే దక్కిందన్నారు. 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ, రూ.500లకే సిలిండర్, మహిళలకు రూ.2500లు, రైతు బందు రూ15వేలు, రూ 2లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమాయే అని ప్రశ్నించారు.

Spread the love