ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయను: కేజ్రీవాల్

నవతెలంగాణ – ఢిల్లీ:  మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ వ్యవహారంలో జైలుకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, జైలు నుంచే పాలనా వ్యవహారాలు చేస్తున్నానని చెబుతున్న ఆయనను.. రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై కేజ్రీవాల్‌ స్పందించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని తేల్చి చెప్పారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  బీజేపీ పై మరోసారి విమర్శలు గుప్పించారు.

Spread the love