ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌పై ప్ర‌కాష్ అంబేద్క‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు

prakash ambedkarనవతెలంగాణ – హైదరాబాద్
ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్ల‌పై వంచిత్ బ‌హుజ‌న్ అఘాది (వీబీఏ) చీఫ్ ప్ర‌కాష్ అంబేద్క‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రధాని మోదీకి కొన్ని వాస్తవాలు తెలియవని ఆయ‌న వ్యాఖ్యానించారు. ముస్లింలకు విద్యా రిజర్వేషన్‌పై హైకోర్టు, సుప్రీంకోర్టులు బాస‌ట‌గా నిలిచాయి..సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్‌కి ఓసారి వెన్నుదన్నుగా నిలిస్తే.. పార్లమెంటు అడ్డుకునే అవ‌కాశ‌మే లేదని ప్ర‌కాష్ అంబేద్క‌ర్ స్ప‌ష్టం చేశారు. దీంతో ఇప్పుడు ముస్లింలకు విద్యా రిజర్వేషన్లు అంశంగా మారనుందని అది హిందూ ఓట్లపై ప్ర‌భావం చూపుతుంద‌ని అన్నారు. ప్ర‌ధాని మోదీ ఇప్పుడు ఆ 5 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని  చెబుతున్నార‌ని అన్నారు. మ‌రోవైపు న‌రేంద్ర మోదీ సార‌ధ్యంలో బీజేపీ ప్ర‌భుత్వం మూడో సారి అధికారంలోకి వ‌స్తే రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తార‌నే ప్ర‌చారం ఎన్నికల్లో హాట్ డిబేట్‌గా మారింది. విపక్ష ఇండియా కూట‌మి ఈ అంశాన్ని హైలైట్ చేస్తుండ‌గా రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేసే ప్ర‌స‌క్తే లేద‌ని, వాటిని కొన‌సాగిస్తామ‌ని బీజేపీ స్ప‌ష్టం చేస్తోంది.

Spread the love