థాయ్‌లాండ్ ఓపెన్‌లో కిర‌ణ్ జార్జ్ సంచ‌ల‌నం

నవతెలంగాణ వెబ్ డెస్క్: థాయ్‌లాండ్ ఓపెన్‌లో భార‌త కుర్రాడు కిర‌ణ్ జార్జ్ సంచ‌ల‌నం సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో త‌న‌కంటే మెరుగైన ర్యాంక‌ర్ అయిన వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌ను ఓడించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. 59వ ర్యాంక‌ర్ కిర‌ణ్ 32వ రౌండ్‌లో 9వ ర్యాంక‌ర్ షి య‌కీ(చైనా)పై గెలుపొందాడు. 22 ఏండ్ల కిర‌ణ్‌ ఆట ప్రారంభం నుంచి ఆధిప‌త్యం చెలాయించాడు. వ‌రుస సెట్ల‌లో 21-18, 22-20తో య‌కీని చిత్తు చేశాడు. దాంతో, ప్రీ – క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లాడు. ‘ఒడిషా ఓపెన్ 100 టోర్న‌మెంట్ నుంచి కిర‌ణ్ జార్జ్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు టైటిల్ గెల‌వ‌లేకపోయాడు. గ‌త నాలుగు, ఐదు నెల‌ల నుంచి అత‌డి ఆత్మ‌విశ్వాసంతో లేడు. అలాంటిది థాయ్‌లాండ్ ఓపెన్‌లో కిర‌ణ్ అనూహ్యంగా పుంజుకున్నాడు’ అని కిర‌ణ్ కోచ్ సాగ‌ర్ చొప్డా తెలిపాడు. యుకీ 2018 వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్‌లో ర‌జ‌త ప‌త‌కం గెలిచాడు.

Spread the love