స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఇప్పట్లో లేనట్లే: కిషన్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్:  విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణ ఫైల్ పెండింగ్‌లో ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పట్లో ప్రైవేటీకరణ జరగదన్నారు. ప్రజలు, కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్‌ను కొనుగోలు చేసేంత పెద్ద సంస్థలు ప్రస్తుతం కనిపించడం లేదన్నారు. సంస్థకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. గనుల వేలంలో పాల్గొని విశాఖ స్టీల్ కూడా క్యాప్టివ్ మైన్స్ సొంతం చేసుకోవచ్చని తెలిపారు.

Spread the love