భారతదేశంలో 13వ షోరూమ్‌ను ప్రారంభించిన కిస్నా డైమండ్, గోల్డ్ జ్యువెలరీ

నవతెలంగాణ – హైదరాబాద్ : మహోన్నతమైన  హరి కృష్ణ గ్రూప్ కు చెందిన ప్రసిద్ధ జ్యువెలరీ బ్రాండ్, కిస్నా,  నగల డిజైనింగ్, తయారీ, సేవలో 18 సంవత్సరాలకు పైగా అసమాన నైపుణ్యాన్ని సగర్వంగా ముత్యాల నగరి,  హైదరాబాద్‌కు తీసుకువస్తోంది. నాణ్యత, నైపుణ్యం మరియు కస్టమర్ సంతృప్తి పట్ల అచంచలమైన నిబద్ధత కిస్నాని పరిశ్రమలో విశ్వసనీయ,  ప్రసిద్ధ సంస్థ గా స్థిరపరచింది. ఆభరణాల పరిశ్రమలో కిస్నా ప్రయాణం అసాధారణత కు తక్కువేమీ  కాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా, కిస్నా  తమ  వినియోగదారుల విశ్వాసం, విధేయతను సంపాదించుకుంది, ఇది అసమానమైన నాణ్యత, చక్కదనం యొక్క చిహ్నంగా ఉంది. కిస్నా  దాని వినూత్నమైన “మైన్స్ టు మార్కెట్” సిద్ధాతం పట్ల గర్విస్తుంది, ఇది సోర్స్ నుండి షోరూమ్ వరకు అత్యధిక నాణ్యతా ప్రమాణాలను నిర్ధారిస్తుంది. ఈ విధానం కిస్నాని అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలకనుగుణంగా వేగంగా స్వీకరించడానికి వీలు కల్పిస్తుంది, సమాజంలోని ప్రతి సందర్భం, విభాగానికి తగిన రీతిలో నగల కలెక్షన్లను అందిస్తుంది. ఇనార్బిట్ మాల్ హైదరాబాద్‌లో కిస్నా  యొక్క ప్రత్యేకమైన 13 వ  షోరూమ్ యొక్క భారీ ప్రారంభోత్సవాన్ని  ఫౌండర్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ  ఘనశ్యామ్ ధోలాకియా మరియు కిస్నా డైరెక్టర్ శ్రీ  పరాగ్ షా సమక్షం లో ప్రారంభించారు.  ఈ శుభ సందర్భం కిస్నా  యొక్క విశేషమైన ప్రయాణంలో మరో మైలురాయిని గుర్తించి, దాని వినియోగదారులకు అద్భుతమైన ఆభరణాలను అందించింది. కిస్నా , 2005లో ప్రారంభించబడింది, కిస్నా  యొక్క విజయగాథ పంపిణీ-ఆధారిత మోడల్‌పై నిర్మించబడింది, ఇది బ్రాండ్ తమ ఉనికిని భారతదేశం అంతటా 3500 షోరూమ్‌లకు విస్తరించడానికి అనుమతించింది. ఈ విస్తృతమైన అవుట్‌లెట్‌ల నెట్‌వర్క్ కిస్నా  యొక్క కాలాతీత  ఆభరణాల కలెక్షన్లు  దేశంలోని ప్రతి మూలలో ఉన్న కస్టమర్‌లకు చేరుకునేలా చేస్తుంది. ఇనార్బిట్ మాల్ హైదరాబాద్‌ లో తమ షో రూమ్ ను ప్రారంభించటానికి ముందు, కిస్నా ఇప్పటికే సిలిగురి, హైదరాబాద్, హిసార్, అయోధ్య, బరేలీ, రాయ్‌పూర్, ద్వారక,  ఢిల్లీ, ముంబై, జమ్ము, బెంగళూరు, ప్రీత్ విహార్ న్యూఢిల్లీ మరియు ఘజియాబాద్ షోరూమ్‌లతో సహా వివిధ నగరాల్లో స్టోర్‌లను ప్రారంభించింది. ఇనార్బిట్ మాల్ షోరూమ్ జోడింపు భారతదేశం అంతటా విభిన్న ప్రాంతాలు మరియు నగరాల్లోని వినియోగదారులకు సేవలందించేందుకు కిస్నా  నిబద్ధతను మరింత పటిష్టం చేస్తుంది. నూతన షోరూమ్‌ల ప్రారంభంపై శ్రీ ఘనశ్యామ్ ధోలాకియా మాట్లాడుతూ, “నగరానికి మా సరికొత్త డిజైన్‌లను పరిచయం చేయడం కోసం కిస్నా యొక్క రెండవ షోరూమ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించటం పట్ల మేము సంతోషిస్తున్నాము, దేశంలోని ప్రతి మహిళకు వజ్రాలను అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం, భారతదేశంలోని ప్రతి ఇంటిని చేరుకోవడమే మా విస్తరణ ప్రణాళికల లక్ష్యం.  ఈ  నూతన షోరూమ్‌లలో, వినియోగదారులు హరి కృష్ణ గ్రూప్ నైపుణ్యాన్ని పూర్తిగా తెలుసుకునే అవకాశం కల్పించటం తో పాటుగా  ప్రతి సందర్భానికి తగిన వివిధ రకాల వజ్రాలు, బంగారు నగల ఎంపికలను వారికి అందించాలని మేము కోరుకుంటున్నాము” అని అన్నారు.  శ్రీ పరాగ్ షా మాట్లాడుతూ, “అందమైన హైదరాబాద్ నగరంలో మా స్టోర్‌ను ప్రారంభించడమనేది  వృద్ధి, విస్తరణ దిశగా  తదుపరి దశలో ముందుకు సాగడం లో భాగం. ఈ నగరం నగలలో ప్రత్యేకమైన డిజైన్‌లకు ప్రసిద్ధి చెందినందున, స్థానిక అభిరుచులకు అనుగుణంగా నగలను ప్రత్యేకంగా తీర్చిదిద్దటం  లక్ష్యంగా పెట్టుకున్నాము. రాష్ట్రం లో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి కిస్నా హైదరాబాద్ వాసులకు , వారి  విలక్షణమైన శైలి, ప్రాధాన్యతలతో ప్రతిధ్వనించే ఆభరణాలను అందించాలని నిశ్చయించుకుంది. భారతీయ మార్కెట్ కోసం సృష్టించబడిన ప్రతి ఆభరణం, నాణ్యత, నైపుణ్యం పట్ల  బ్రాండ్ యొక్క నిబద్ధత చూపుతుంది.  తమ కస్టమర్లతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి కిస్నా అంకితం చేయబడింది, ప్రతి వ్యక్తి ,  విలువైనదిగా మరియు ప్రతిష్టాత్మకంగా భావించేలా చూస్తుంది” అని అన్నారు.

Spread the love