
తెలంగాణవిద్యావంతుల వేదిక ఆద్వర్యములో నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారము సాయంత్రము 4 గంటలకు నిర్మల్ లోని పెన్షనర్స్ భవన్ నందు నిర్వహించే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనమునకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర సాధకులు, ఉద్యమ రథసారధి, ఎమ్మెల్సీ ప్రో కోదండరాం హాజరు కానున్నన్నట్లు ముధోల్ నియోజకవర్గం తెలంగాణ జన సమితి పార్టీ ఇంచార్జి సర్థార్ వినోద్ కుమార్ శనివారం ఒక్క ప్రకటన లో తెలిపారు. నిర్మల్ జిల్లాలోని ఉద్యమకారులందరు పెద్ద ఎత్తున హాజరై ఉద్యమ కారుల సమస్యల సాధనలో పాలుపంచుకొని కార్యక్రమాన్ని విజయవంతము చేయాలని కోరారు.