Wednesday, May 13, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్అడుగంటుతున్న కృష్ణమ్మ 

అడుగంటుతున్న కృష్ణమ్మ 

- Advertisement -

శ్రీశైలం ప్రాజెక్టు లో తగ్గుతున్న నీటిమట్టం 
విద్యుత్తు ఉత్పత్తిని నిలిపిన అధికారులు
నవతెలంగాణ-అచ్చంపేట
(నీలం సంజీవ రెడ్డి సాగర్) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణా నదిపై నల్లమల కొండలలో నిర్మించిన భారీ బహుళార్థసాధక ప్రాజెక్టు. ఇది 512 మీటర్ల పొడవు, 145 మీటర్ల ఎత్తుతో, 12 రేడియల్ క్రస్ట్ గేట్లతో నిండిన జలాశయం. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి (770 MW + 900 MW) మరియు ఆయకట్టు సాగునీటి అవసరాల కోసం పనిచేస్తుంది. తెలంగాణలోని నాగర్ కర్నూల్  జిల్లాల సరిహద్దులో ఉంది.

1960లో ప్రారంభమై, 1981లో పూర్తయింది. మొత్తం నిల్వ సామర్థ్యం సుమారు 215 టీఎంసీలు. (పూర్తి స్థాయి 885 అడుగులు) నీటిపారుదల కర్నూలు, కడప జిల్లాలకు వినియోగించడం జరుగుతుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి సమీపంలో ఉండటంతో.. ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది. శ్రీశైలం ప్రాజెక్టు దేశంలోని అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇంతటి ప్రాధాన్యత గల శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. ఎండలు తీవ్రత పెరుగుతుంది. భూగర్భ జలాలు అడగంటి పోతున్నాయి.

నీటి నిలువ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం కేవలం 40 టిఎంసిల నీటి నిలువ ఉందని, 885 అడుగులకు గాను  ప్రస్తుతం 817 అడుగులకు నీటిమట్టం తగ్గినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుముఖం పడుతుండడంతో అధికారులు ముందు జాగ్రత్తగా జల విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేశారు. ప్రస్తుతం నిలువ ఉన్న నీటిని కేవలం తాగునీటి అవసరాలకు వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -